హైదరాబాద్

సృజన ప్రతిభా పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: సృజన సాహితీయ సాంస్కృతిక సంస్థ 2015, 2016 సంవత్సరాలకు వివిధ రంగాల్లోని పదిమందికి ఆదివారం రవీంద్రభారతిలో ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేసింది. 2015 సంవత్సరానికి కె.బసిరడ్డె, జి.చంద్రవౌళి, సిహెచ్ రామచంద్రారెడ్డి, డా.ఎం.ఆశసుబ్బలక్ష్మీ, కథక్ నృత్యకళాకారుడు అంజిబాబుకు, 2016 సంవత్సరానికి డా.డి.విజయ కిశోర్, డా.సి.్భక్తవత్సలరెడ్డి, పి.సునీతా మహేందర్‌రెడ్డి, సినీ దర్శకుడు ఎస్‌వి కృష్ణారెడ్డి, సత్కళా భారతి సత్యనారాయణకు పురస్కారాలను అందించారు. సినీ నిర్మాత, దర్శకుడు తమ్మిరెడ్డి భరద్వాజ అధ్యక్షత వహించారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సమాజంలో నిష్ణాతులను సత్కరించుకోవడం మంచి సంప్రదాయమని అన్నారు. ఏపి ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ వివధ రంగాలలోని నిష్ణాతులను సత్కరించుడం నేటి తరానికి ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్పారు. సంస్థ వ్యవస్థాపకురాలు అంజనా చౌదరి స్వాగతం పలికారు. తొలుత రమ్యతేజ పుంజల కూచిపూడి నృత్యశైలిలో భామకలాపం అంశాన్ని ప్రదర్శించింది. బాల మురళీకృష్ణ విరచిత థిల్లాన అంశాన్ని ప్రదర్శించింది. లక్ష్మీనారాయణ తన నృత్యంలో ఆనంద నర్తన గణపతి అంశంతో ప్రారంభించి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ కావ్యంలోని ‘కొలువైతివా రంగస్వామి..’ అంశాన్ని కడురమ్యంగా నర్తించారు.