జాతీయ వార్తలు

దౌత్యమంటే తమాషా కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: దౌత్యమంటే జనం ముందు తమాషాలు చేయడం కాదని, అందుకు లోతైన అవగాహన, చిత్తశుద్ధి ఎంతో అవసరమనే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. సియోల్‌లో అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి) సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు భారత్‌కు ‘ఇబ్బందికరమైనవి’గా ఉన్నాయని ఆ పార్టీ పేర్కొంది. ‘ఎన్‌ఎస్‌జి సభ్యత్వ విషయంలో భారత్ ఎందుకు అసహనాన్ని ప్రదర్శించిందో, పాకిస్తాన్‌ను మన దేశాన్ని ఒకే గాటన కట్టేందుకు ఎందుకు అనుమతించారో అర్ధం కావడం లేదు. దౌత్యం సాగించడమంటే బహిరంగంగా తమాషాలు చేయడం కాదు. అందుకు ఎంతో నేర్పు, లోతైన అవగాహన, చిత్తశుద్ధి అవసరమన్న విషయాన్ని మోదీ ఇప్పటికైనా తెలుసుకోవాలి’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ శుక్రవారం న్యూఢిల్లీలో విలేఖరులతో అన్నారు.
ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వాన్ని సాధించేందుకు మోదీ ప్రభుత్వం అనవసరంగా విస్తృత స్థాయిలో లాబీయింగ్ చేసిందని, ఈ విషయంలో మోదీ తనంతట తాను నవ్వులపాలవడంతో పాటు దేశాన్ని కూడా నవ్వులపాలు చేయడాన్ని ప్రపంచమంతా చూసిందని, దీంతో భారత్ అనవసరంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని సాధించేందుకు మోదీ సర్కారు ఇంత విస్తృత స్థాయిలో లాబీయింగ్ చేసి ఉంటే దానిని అందరూ అర్ధం చేసుకుని ఉండే వారని, అయితే ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలతో అణు ఇంధన వ్యాపారానికి అవరోధాలు లేనప్పుడు మోదీ ప్రభుత్వం అర్ధం పర్ధం లేకుండా ఇంత విస్తృత స్థాయిలో లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదని ఆనంద్ శర్మ విమర్శించారు.