జాతీయ వార్తలు

ఢాకాపై ఉగ్ర పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 1: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులు ఓ రెస్టారెంట్‌లోకి ప్రవేశించి 60మందిని బందీలుగా చేసుకున్నారు. పోలీసులతో విచ్చల విడిగా కాల్పులకు దిగడంతో అనేక మంది మరణించినట్టుగా స్పష్టమవుతోంది. అత్యధిక స్థాయి భద్రత కలిగిన గుల్షన్ ప్రాంతంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం దేశ వ్యాప్తంగా అలజడి రేకెత్తింత్తించింది. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారిలో 20మంది విదేశీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. విదేశీయులు తరచుగా వచ్చే హోలీ ఆర్టిసన్ రెస్టారెంట్‌లోకి రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఐదుగురు సాయుధ మిలిటెంట్లు ప్రవేశించారని, అందులో ఉన్న 60మందిని బందీలుగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే భారీ ఎత్తున ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు తరలివచ్చాయి. వారిపై మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు కూడా విసరడంతో పలువురు జవాన్లు మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. రెస్టారెంట్ కిచెన్‌లో పనిచేస్తున్న ఓ కార్మికుడు తప్పించుకు వచ్చి లోపలి పరిస్థితిని, ఎంత మంది మిలిటెంట్లు ఉన్నారన్న విషయాన్నీ భద్రతాదళాలకు తెలియజేశాడు.
chitram..
రెస్టారెంట్ వద్ద భద్రతా దళాలు