హైదరాబాద్

ఎన్నికల అధికారులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ జిహెచ్‌ఎంసి ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు నిర్వహించాల్సిన ఎన్నికల విధులపై ఇప్పటికే నియమితులైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారులకు సోమవారం ప్రధాన కార్యాలయంలో ఒక్కో బ్యాచ్‌లో 40 మంది రిటర్నింగ్ అధికారులు, మరో 40 మంది అసిస్టెంటు రిటర్నింగ్ అధికారులతో రెండు బ్యాచ్‌లుగా శిక్షణనిచ్చారు. ముఖ్యంగా ఇసిఐఎల్ ఇంజనీర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనితీరును సోదాహరణంగా వివరించారు. దీంతో పాటు పోలింగ్‌కు ముందు నిర్వహించాల్సిన నామినేషన్ల పరిశీలన ఇతరత్ర అంశాలకు సంబంధించి శిక్షణనిచ్చారు. ఇవిఎంపై డెమోస్ట్రేషన్ ఇచ్చిన ఇసిఐఎల్ ఇంజనీర్లు రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, నిర్వహంచని పనులను వివరించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలకు నోడల్ అధికారిగా నియమితులైన యూసిడి విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ శశికిరణాచారి ఈ సందర్భంగా ఎన్నికల విధుల నిర్వహణ అంశంపై సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ రోజుతో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారుల అసలైన విధులు ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ ఏర్పాట్లు, ఆ తర్వాత కౌంటింగ్ ప్రశాంతంగా ముగియటంతో మన విధులు పూర్తవుతాయని వివరించారు. ప్రతి ప్రక్రియలోనూ సిబ్బంది చిత్తశుద్ధితో, పారదర్శకతతో విధులు నిర్వర్తించి, ఎన్నికలు ప్రశాతంగానూ, ప్రజాస్వామ్యబద్దంగా నిర్వర్తించటంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.

బల్దియా కార్మికులకు ఏటా వైద్య పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 14: మహానగర పాలక సంస్థలోని పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ప్రతి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి వెల్లడించారు. యశోద ఆసుపత్రి వైద్యులచే సోమవారం ఖైరతాబాద్ రవాణా విభాగంలో కార్మికులకు నిర్వహించిన ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఆసుపత్రికి చెందిన పది విభాగాల వైద్యులు, సిబ్బంది ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యం ఉంటేనే నగర పౌరులు ఆరోగ్యం ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సర్కిళ్ల వారీగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 14, 15,19 తేదీల్లో సుమారు 975 మంది డ్రైవర్లు, 1675 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఈ వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దని, 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి కార్మికుడు నెలకు రూ. 12ను ప్రీమియంగా చెల్లించి ప్రధాన మంత్రి బీమా యోజన పథకం కింద రూ. 2లక్షల ప్రమాద బీమాను పొందాలన్నారు. జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చెత్త నిర్వహణ వాహనాల డ్రైవర్లకు కూడా వైద్య పరీక్షలు, అదీ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులచే నిర్వహించాలని కమిషనర్ తీసుకున్న నిర్ణయం పట్ల కార్మికుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం యశోద ఆసుపత్రి వైద్యులు డా. గురుప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు అనారోగ్యం బారిన పడకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ఫిజీషియన్ తదితర విభాగాల సూపర్ స్పెషాలిటి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అంతేగాక, ఎకో, ఆల్ట్రా, బీపీ చెకప్, ఎక్స్‌రే తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో పాటు కమిషనర్ జనార్దన్‌రెడ్డి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

పాతబస్తీలో నేడు మంత్రి కెటిఆర్ పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 14: మహానగర పాలక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం అభివృద్ధి పనులను మమ్మరం చేసింది. ఇప్పటికే నగరంలోని పది ప్రాంతాల్లో పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి కె. తారకరామారావు మంగళవారం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు బేగంపేట క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరనున్న మంత్రి కెటిఆర్ బండ్లగూడలో కొత్తగా నిర్మించిన సౌత్ జోన్ ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత గుర్రం చెరువు, సూరారం చెరువుల అభివృద్ధి కోసం శంకుస్థాపనలు చేయనున్నారు.
ఆ తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్‌కు ఎదురుగా ఉన్న జంగమ్మెట్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత రక్షాపురంలో రూ. 50లక్షల వ్యయంతో నిర్మించనున్న మోడల్ మార్కెట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత రూ. 5 కోట్ల వ్యయంతో మైసారంలో ఏర్పాటు చేయనున్న 5.00 ఎంఎల్ ఇన్‌లెట్, ఔట్‌లెట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించి మిధానీ క్రాస్‌రోడ్డుతో పాటు వివిధ ప్రాంతాల్లో బిటి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రియాసత్‌నగర్‌లో 12 ఎంఎల్ సామర్థ్యం కల్గిన రిజర్వాయర్‌ను ప్రారంభించి, అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి కెటిఆర్ ప్రసంగించనున్నారు. సాయంత్రం నాలుగున్నర సమయంలో చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పురానాపూర్ సమీపంలోని పార్దివాడ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం స్కీంకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఈ నెల 17వ తేదీన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఎంతమంది నేతలు వెళ్లినా
టిడిపికి నష్టం లేదు:నైషధం

సికింద్రాబాద్, డిసెంబర్ 14: తెలుగుదేశం పార్టీ సముద్రం లాంటిదని ఎంతమంది పోయినా చెక్కుచెదరకుండా ఉంటుందని నగర సీనియర్ నాయకులు నైషధం సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. సోమవారం నగర టిడిపి కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బలహీనపర్చాలని చూస్తే వారే బలహీన పడిపోతారని అన్నారు. దేశంలోనే బలమైన క్యాడర్ కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు. కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్లినంత మాత్రానా తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని అన్నారు. నాయకులు వెళ్లినా అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతమని అన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎదురులేదని బిజెపితో కలిసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని గ్రేటర్ పీఠం దక్కించుకుంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదని మూర్తి పేర్కొన్నారు. అధికార పార్టీ దాదాపు రెండు సంవత్సరాలు కాలయాపన చేసి గ్రేటర్ ఎన్నికలు తరుముకు రాగానే శంకుస్థాపనల పండుగులను నిర్వహిస్తూ శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. చేయని పనులకు హంగామా చేస్తున్న మంత్రులు ఆత్మవిమర్శన చేసుకోవాలని అన్నారు. నిధులు విడుదల కాని టెండర్లు ఖరారు కాని పనులకు శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నారో ప్రజలందరికి తెలుసునని మూర్తి తెలిపారు. నగర ప్రజలు చాలా తెలివైన వారని మభ్యపెట్టాలని చూస్తే వారు పార్టీలను నామరూపాలేకుండా పాతిపెడతారని గతంలో నిరూపించారని అన్నారు. అందుకే చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలి, చేయగలిగిన పనులనే చేస్తామని చెప్పాలని హితవుపలికారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఎంతో చెప్పుకోవడానికి ఏమిలేదని అందుకే ఆదరబాదరగా ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజల దృష్టిని మరలుస్తూ హడావిడి హంగామా చేస్తున్నారని అన్నారు. అదే అభివృద్ధి అంటూ ప్రజలను ఆశలపల్లకి ఎక్కిస్తున్నారని అన్నారు. కాని అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిందేనని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నగరంలో జరిగిన అభివృద్ధి తప్ప చెప్పుకోవడానికి ఒక్కటీ తెరాస చేపట్టలేదని అన్నారు. అయినప్పటికి స్వార్థప్రయోజనాల కోసం నేతలు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి నేతల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదని పార్టీ మరింత బలపడుతుందని మూర్తి పేర్కొన్నారు.
నిర్వహణ శూన్యం..వసూళ్లు ఘనం!
రద్దీ జంక్షన్లలో మొరాయిస్తున్న సిగ్నల్స్ అస్తవ్యస్తంగా ఈ చలాన్ల వడ్డన
మ్యానువల్ ఆపరేషన్‌తో పోలీసుల ఉరుకులు, పరుగులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 14: కొత్త సంస్కరణలు, ఆధునిక పోలీసింగ్ అంటూ చెప్పుకుంటున్న నగర పోలీసులు ఇంకా పాత జమానాలోనే ఉన్నారు. నగరంలో నివసించే ప్రతి పౌరుడికి తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించటంలో పోలీసులు వెనకబడే ఉన్నారన్న విమర్శలున్నాయి. మరో రకంగా చెప్పాలంటే ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణను గాలికొదిలేసిన పోలీసులు, వాటినే ఆధారంగా చేసుకుని వాహనదారులకు ఇష్టారాజ్యంగా ఈ చలానాలు వడ్డిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కేవలం చలాన్ల వసూళ్లకే పరిమితమైందని చెప్పవచ్చు. మహానగరం పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బలా తయారైంది. నగరంలోని ఎక్కువ శాతం ప్రతి ప్రతిరోజు ఎదుర్కొనే ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. మెట్రోరైలు పనులు వేగవంతం కావటంతో ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షల అమలు, మరోవైపు సక్రమంగా పనిచేయని సిగ్నల్స్ కారణంగా ట్రాఫిక్ నియంత్రణ అధికారులకు తలనొప్పిగా మారింది. సిగ్నల్స్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు నలువైపులా పరుగులు తీస్తూ సిగ్నల్స్‌ను మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎలాంటి అడ్డంకుల్లేకుండా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేకపోవటం కూడా ఇందుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. రౌండ్ ది క్లాక్ ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించిన సర్కారు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ముఖ్యమైన సిగ్నల్స్‌పై దృష్టి సారించకపోవటం శోచనీయం. నగరంలోని విఐపి జోన్ పరిధిలోని సచివాలయం ముందు, అసెంబ్లీ ముందు, అంబేద్కర్ విగ్రహం వద్ధ, లక్డీకాపూల్ చౌరస్తా, మాసాబ్‌ట్యాంక్, నాంపల్లి చౌరస్తా వంటి ప్రధాన కూడళ్లలో సైతం నిత్యం ట్రాఫిక్ సిగ్నల్స్ మొరాయిస్తున్నాయి. గ్రేటర్ అధికారులు, మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ట్రాఫిక్ నియంత్రణపై ముంబై నగరంలో అధ్యయనం చేసినానంతరం రూపొందించిన పలు ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవటం, మరోవైపు కనీసం సిగ్నల్స్‌కు మరమ్మతులు కూడా చేపట్టకపోవటంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీ ముందున్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసుల ఉరుకులు, పరుగులు వేరే చెప్పనక్కర్లేదు.
అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ...
పేరుకు మహానగరంగా చెప్పుకునే హైదరాబాద్ సిటీ విఐపి జోన్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ కూడలి, సచివాలయం ముందు కూడలిలో ఉన్న సిగ్నల్స్ సైతం తరుచూ మొరాయిస్తుంటాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ ఇక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించటం అంటే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించటమేనంటూ పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు సైతం బాహాటంగానే చెబుతున్నారు. పాత కంట్రోల్ రూం ముందున్న సిగ్నల్స్‌ను ట్రాఫిక్ పోలీసులు ఉరుకులు, పరుగులు పెడుతూ మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సిన దుస్థితి ఉండగా, ట్రాఫిక్ పోలీసులు మాత్రం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆధునిక విధానాలను అవలంబిస్తున్నామని చెప్పుకోవటం గమనార్హం. ఆకుపచ్చ లైటు పడిందంటూ దూసుకోచ్చే వాహనాలు సరిగ్గా స్టాప్‌లైన్ దాటుతున్న సమయంలోనే సిగ్నల్స్ ఆరేంజ్, ఆ తర్వాత రెడ్‌లైటు పడటంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. కానీ సిసి కెమెరాల్లో మాత్రం ట్రాఫిక్ లైన్ దాటినట్లు ఫొటోలు చూపిస్తూ, పోలీసులు చలానాలు వసూలు చేస్తున్నారే తప్ప, వాహనదారులకు అనుకూలంగా, కనీసం వారు పరుగులు పెట్టకుండా సిగ్నల్స్ పనిచేసే విధంగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నది హాట్ టాపిక్‌గా మారింది.
అడ్డదిడ్డంగా ‘బస్ బే’లూ !
నగరంలోని వివిధ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమయ్యేందుకు బస్‌బేలు ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇప్పటికే పలు అధ్యయనాల్లో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు రోడ్డుపై ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలేర్పడకుండా బస్‌బేలను ఏర్పాటు చే