జాతీయ వార్తలు

భక్తి శ్రద్ధలతో ఈద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: దేశవ్యాప్తంగా ముస్లింలు గురువారం పవిత్ర రంజాన్ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉపవాస దీక్షల విరమణ రోజయిన ఈదుల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరపడానికి పెద్ద సంఖ్యలో జనం మసీదులు, ఈద్గాలకు పోటెత్తారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి స్వీట్లు పంచుకొని పండుగ చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సంప్రదాయ కొత్త దుస్తులు ధరించిన వేలాది మంది ముస్లింలు చరిత్రాత్మక జామా మసీదు, ఫతేపురి మసీదు, హజ్రత్ నిజాముద్దీన్ తదితర మసీదులకు నమాజ్ కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు. బంధుమిత్రులకు స్వాగతం పలకడం కోసం జనం పెద్ద సంఖ్యలో మిఠాయిలు కొనుగోలు చేయడంలో బిజీగా ఉండడంతో జామా మసీదు, చాందినీ చౌక్ ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపించింది. మసీదులు, ఈద్గాల వద్ద, జనం పెద్ద సంఖ్యలో చేరే ప్రాంతాల్లో విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీతో పాటుగా దేశంలోని మిగతా నగరాల్లో సైతం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్మూ, కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ముస్లింలు బుధవారమే రంజాన్‌ను జరుపుకోవడం తెలిసిందే. ఈద్ సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఫ్రదాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సైతం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చిత్రం.. ఈద్ సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదు వద్ద గురువారం ప్రార్థనల అనంతరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్న ముస్లింలు