క్రీడాభూమి

రష్యా భవితపై నిర్ణయానికి మరో వారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాసానే, జూలై 20: డోపింగ్ కుంభకోణంలో పీకల్లోతున కూరుకుపోయిన రష్యా క్రీడాకారులను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలా? లేక వారిపై నిషేధం విధించాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కనీసం ఇంకో వారం రోజుల సమయం పడుతుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) బుధవారం స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ డోపింగ్ కుంభకోణం విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఐఓసి అధికారులు ఒకవైపు తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడుతుండగా, మరోవైపు వచ్చే నెల 5వ తేదీన బ్రెజిల్‌లో రియో ఒలింపిక్స్ ప్రారంభవేడుకలకు సమయం ముంచుకొస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే రష్యా క్రీడాకారులను రియో ఒలింపిక్స్‌కు అనుమతించాలా? లేదా? అన్నదానిపై ఆరంభ వేడుకలకు కనీసం 10 రోజుల ముందైనా ఐఓసి తుది తీర్పును వెలువరిస్తుందో, లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ముందు రష్యా వ్యవహారంలో క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు ఎదురుచూడాలని ఐఓసి కార్యవర్గం మంగళవారం నిర్ణయించింది. రష్యా క్రీడాకారులను ఒలింపిక్స్‌కు అనుతించాలా? లేక వారిపై సంపూర్ణ నిషేధం విధించాలా? అనే అంశంపై నిత్యం సమీక్ష జరుపుతున్నామని, ఒలింపిక్ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యతతో కూడిన ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు న్యాయపరమైన అన్ని అంశాలను అధ్యయనం చేస్తున్నామని ఐఓసి తెలిపింది.
ఒలింపిక్స్‌కు 387 మందితో రష్యా జట్టు
ఇదిలావుంటే, యావత్ క్రీడా ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసిన డోపింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యే ప్రమాదం రష్యాను వెంటాడుతున్నప్పటికీ రియో ఒలింపిక్స్ కోసం ఆ దేశం పటిష్టమైన జట్టును ఎంపిక చేసుకుంది. మాస్కోలో సమావేశమైన రష్యా ఒలింపిక్ కమిటీ కార్యవర్గం మొత్తం 387 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని రియో ఒలింపిక్స్‌కు పంపేందుకు ఆమోదం తెలిపింది. ఈ జట్టులో 68 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఉన్నారు. ప్రస్తుతం వీరి భవితవ్యం లాసానేలోని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎస్‌ఎ)లో ఊగిసలాడుతోంది.

నోయిడాలో గోపీచంద్ అకాడమీ
న్యూఢిల్లీ, జూలై 20: జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ శ్రేణి అకాడమీని నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి గోపీచంద్, గ్రేటర్ నోయిడా పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (జిఎన్‌ఐడిఎ), స్పోర్ట్జ్‌లైవ్ సంస్థల మధ్య బుధవారం న్యూఢిల్లీలో ఒప్పందం కుదిరింది. హైదరాబాద్, గ్వాలియర్, వడోదర నగరాల్లో ఇప్పటికే బాడ్మింటన్ అకాడమీలను నడుపుతున్న గోపీచంద్ ఉత్తర భారతావనిలో నెలకొల్పుతున్న మొదటి అకాడమీ ఇదే.