ఖమ్మం

ఉత్సాహంగా తీజ్ పండుగ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, జూలై 24: గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏటా గిరిజన (లంబాడీ) యువతులు జరుపుకునే తీజ్ పండుగ సంబురాలను మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో జరుపుకునే పండుగకు వారం రోజులుగా గ్రామ కూడళ్లల్లో కూటములను ఏర్పాటు చేసుకుని యువతులు వారి ఇష్ట దైవాన్ని కొలుచుకుంటూ నృత్యాలు చేశారు. కూటములు వద్ద ప్రారంభం రోజున నాటిన గోధుమలు మొలకెత్తటంతో వాటిని చేతపట్టుకుని సమీపంలో నీళ్లున్న ప్రదేశాల్లో నిమజ్జనం చేసేందుకు యువతులు ఊరేగింపుగా బయలు దేరారు. ఈసందర్భంగా యువతులు వేకువ జామునుంచే భక్తిశ్రద్ధలతో ఇలవేల్పులను తలచుకుంటూ సాంప్రదాయబద్ధంగా పలు గ్రామాల్లో చేసిన నృత్యాలు సంబురాలతో సందడి చేశారు.