ఖమ్మం

మొక్కలు నాటడమే కాదు.. బతికించడం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), జూలై 24: మొక్కలు నాటడమే ప్రధానం కాదని, వాటిని బతికించడం ఎంతో ముఖ్యమని జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ కార్వర్టర్స్‌లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు పాదులు సరిజేసి నీరు పోసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది గతవారం నాటిన మొక్కలకు పాదులు సరిజేసి అవి వంగిపోకుండా ఎదురు బద్దలు కట్టి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ ఈనాడు నాటిన మొక్కలే రేపటి తరాలకు మంచి వాతావరణాన్ని అందిస్తాయని, మొక్కలు నాటామన్నది కాదని, ఎన్ని బ్రతికించామా అన్నది ముఖ్యమన్నారు. నాటిన మొక్కలన్నింటికి మొక్క చుట్టూ అవసరమైన నీటి గుంటలను తీసి మొక్క ఎదిగేంత వరకు నీరుపోసి వాటికి సంరక్షించాలన్నారు. అవసరమైన ప్రదేశాలలో నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నాటిన ప్రతి మొక్క ఎదిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికృష్ణ, డిఎస్పీ మాణిఖ్యరాజ్, ఏఆర్‌ఎస్‌ఐ నర్సింహరావు, ఆర్‌ఎస్‌ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.