మెదక్

అడవుల క్షీణత అభివృద్ధికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, జూలై 25: హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలని రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. స్థానిక ఆర్టీఎ కార్యాలయంలో ఎంవిఐ గణేష్ అధ్యక్షతన నిర్వహించిన హరిత హారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పెద్దసంఖ్యలో పౌరులు ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నారన్నారు. ఫ్రిజ్‌లు, కూలర్లు, ఏసిలు తదితర సౌకర్యాలను పొందుతూ విలాసవంతమైన జీవితానన్ని గడుపుతున్నారన్నారు. విలాసవంతమైన జీవితంకోసం విచ్చలవిడిగా వినియోగిస్తున్న పరికరాలతో భారీగా కార్బన్‌డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సడ్‌లు విడుదలవుతున్నాయన్నారు. దీంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవైపు అభివృద్ధి ఫలాలు అందుకుంటునే, మరోవైపు మనకు తెలియకుండానే అభివృద్ధికి విఘాతం జరుగుతోందన్నారు. ముంచుకోస్తున్న ఈ ఉపద్రవం నుంచి పర్యావరణాన్ని కాపాకుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భాద్యతగా చిన్నాపెద్ద, ఆడమగ అన్న తేడా లేకుండా ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించాలన్నారు. తెలంగాణ భూ భాగంలో 33శాతం అడవులకు బదులుగా 23శాతం మాత్రమే ఉన్నాయన్నారు. తగ్గుముఖం పట్టినా అడవులతో భవిష్యత్తులో ఆక్సిజన్ (ప్రాణవాయు) కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. 10శాతం తగ్గిన అడవులతో కోరుకునే వీలుందన్నారు. ఇప్పటికైనా అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ఎండి.్ఫరీదుద్ధీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ చెన్నూరి లావణ్యచెందు, బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్‌లు మాట్లాడుతూ మొక్కల ప్రధాన్యతను వివిరించారు. హరితహారంలోమొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడంలో తమవంతు పాత్రను నిర్వహించాలన్నారు. ఈ సభలో డిప్యూటి ట్రాన్స్‌పోర్టు కమీష్నర్ రమేష్, ఎంవిఐలు గణేష్, బిఎస్.గౌడ్, నారాయణ, ఆర్‌ఎల్‌ఆర్, సంగమిత్ర పాఠశాలల ఉపాధ్యాయులు, పిల్లలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల చిన్నారులు కార్యాలయం ఆవరణలో 100 మొక్కలు నాటారు.