మెదక్

బాధితుల పరామర్శకు వచ్చిన నేతల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జగదేవ్‌పూర్, జూలై 25 : మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి, కాల్పులకు నిరసనగా అఖిలపక్షం ఇచ్చిన జిల్లా బంద్ పిలుపుమేరకు గజ్వేల్‌లో సోమవారం బంద్ విజయవంతమైంది. గజ్వేల్ పట్టణంతోపాటు నియోజకవర్గ పరిదిలోని వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక, గజ్వేల్ మండలాల పరిధిలో వ్యాపార, వాణిజ్య సంస్థలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. కాగా గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న లాఠీ చార్జి బాదితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, టిడిపి రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, డిసిసి అధ్యక్షులు సునితా లక్ష్మారెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, టిడిపి తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితర నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. అయితే తెల్లవారుజామునే గజ్వేల్ అఖిలపక్షం నేతలు గాలెంక నర్సింలు, సర్దార్‌ఖాన్, రామరాజశర్మ, బొల్లారం ఎల్లయ్య, జంగం నాగరాజు నర్సింహాచారి, లక్ష్మారెడ్డి తదితరులు జిపిపి డిపో వద్దకు చేరుకొని బస్సుల రాకపోకలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముఖ్యంగా అఖిలపక్షం ఇచ్చిన బంద్‌ను పురస్కరించుకొని గజ్వేల్ పట్టణంతోపాటు వంటిమామిడి రాజీవ్ రహదారి, తూప్రాన్ జాతీయ రోడ్డులను పోలీసులు తమ ఆదీనంలోకి తెచ్చుకొని పెద్దఎత్తున బలగాలను మోహరింపజేయడంతోపాటు అనువనువూ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, తూప్రాన్, సిద్దిపేట డిఎస్పిలు వెంకటేశ్వర్లు, శ్రీదర్‌ల నేతృత్వంలో పోలీసులు ప్రతి వాహనాన్ని నిలిపి వేసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న రంగారెడ్డి జిల్లా టిడిపి నేతల కాన్వాయిని పోలీసులు వంటిమామిడి జిల్లా సరిహద్దు వద్ద అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో వారిని అరెస్ట్ చేసి ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అఖిలపక్ష నేతల అరెస్ట్, పోలీసుల లాఠీచార్జిలను నిరసిస్తూ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై దర్నా, రాస్తారోకో చేపట్టిన టిడిపి రాష్ట్ర నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే గజ్వేల్‌లో బంద్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు సంఘీభావ ర్యాలీ చేపట్టగా టిఅర్‌ఎస్ శ్రేణులు భాస్కర్, మాదాసు శ్రీనివాస్ తదితరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొని ఉద్రిక్తతకు దారితీసింది. కాగా పోలీసులను తప్పించుకొని గజ్వేల్ చేరుకునేందుకు ప్రయత్నించిన టిడిపి జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డిని వంటిమామిడి సమీపంలోని పొలాల్లో ఎస్‌ఐ శ్రీశైలం ఆధ్వర్యంలో మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్థుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండగా, ఎస్‌పి చంద్రశేఖర్ నేతృత్వంలో పోలీసులు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.