హైదరాబాద్

స్వీపర్లకు కనీస వసతులు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: తెల్లవారే కల్లా నగరంలోని అన్ని రహదార్లను పరిశుభ్రపరిచే స్వీపర్లకు కనీసం వసతులు కల్పించాలని తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు సి. సతీష్‌కుమార్ అధికారులను కోరారు. అంతేగాక, చెత్తాచెదారంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, కొబ్బరి నూనె, బూట్లు వంటివి వెంటనే ఇవ్వాలని కోరారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మంత్రి కెటిఆర్‌ను కూడా కలిసి ఓ వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు కల్పించాల్సిన కనీస వసతుల విషయంలో గడిచిన కొద్ది సంవత్సరాలుగా గ్రేటర్‌లో ఏ యూనియన్ మాట్లాడకపోవటం పట్ల ఆయన విడ్డూరాన్ని వ్యక్తం చేశారు. అంతేగాక, జలమండలిలోనూ అధికార యూనియన్‌గా కొనసాగుతున్న తామే అక్కడ పనిచేస్తున్న 600 మంది సర్వీసులను పర్మినెంటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో అరకొర జీతాలకు పనిచేస్తున్న సుమారు 370 మంది ఎన్‌ఎంఆర్‌ల పర్మినెంటుకు సంబంధించి ఖాళీలకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చినందున వెంటనే వారిని పర్మినెంటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ దఫా కమిషనర్ జనార్దన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చి, ఆ తర్వాత తమ సమస్యను మంత్రి కెటిఆర్‌కు మొరబెట్టుకోనున్నట్లు వెల్లడించిన ఆయన తమ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగానే స్పందిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లేని పక్షంలో ఆ తర్వాత తదుపరి భివిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు దేవదాస్, హరిరామ్, నేతలు వెంకటేష్, అశోక్‌కుమార్, అంజయ్య, నాగరాజు, పాండు తదితరులు పాల్గొన్నారు.
జిహెచ్‌ఎంసిలో నేడు బోనాలు : ఆషాఢ మాసం పురస్కరించుకుని మంగళవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మంగళవారం బోనాల పండుగను నిర్వహించనున్నట్లు తెలంగాణ జిహెచ్‌ఎంసియూ అధ్యక్షుడు సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ తెలిపారు. పోతరాజు నాట్యవిన్యాసాలతో బోనాలు, తొట్టెల ఊరేగింపులు, తెలంగాణ ధూం ధాంతో ఘనంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నట్లు వారు తెలిపారు.