అనంతపురం

హిందూపురం డివిజన్ వ్యాప్తంగా వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూలై 26 : హిందూపురం, మడకశిర, పెనుకొండ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. గత రెండు నెలలతో పోల్చితే సోమవారం రాత్రి ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. రాత్రి 9.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుఝాము వరకు వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. హిందూపురంలో 64.2, లేపాక్షిలో 54.2, చిలమత్తూరులో 31.44, మడకశిరలో 41.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా పట్టణంలోని హస్నాబాద్, గాంధీనగర్, అహ్మద్‌నగర్, మోడల్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా వర్షం నీటిని బయటకు పారబోసేందుకు అష్టకష్టాలు పడ్డారు. కాగా పలు పాఠశాలల్లోకి నీరు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగించేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులు నీటితో నిండిపోగా డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. దీనికి తోడు ముందస్తుగా వేరుశెనగ పంట సాగు చేసిన రైతులు గత కొంతకాలంగా వర్షం రాకపోవడంతో ఆకాశం వైపు కనె్నత్తి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే పంటలకు నల్లచీడ, పెనుబంక, వేరుకుళ్లు రోగాలు సోకడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈనేపథ్యంలో వర్షం కురడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ వర్షం వేరుశెనగ పంటకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పలు చెక్‌డ్యాంలు, నీటికుంటలు నీటితో కళకళలాడుతున్నాయి.
మడకశిరలో...
మడకశిర : మడకశిర ప్రాంతంలో వర్షం కురవడంతో రైతుల ఆశలు చిగురించాయి. జూన్‌లో కురిసిన వర్షానికి పలువురు రైతులు వేరుశెనగ పంట సాగు చేశారు. అయితే సాగు చేసిన తర్వాత వర్షం రాకపోవడంతో పంటకు నల్లచీడ, పెనుబంక, వేరుకుళ్లు వంటి రోగాలు సోకాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మడకశిర ప్రాంతంలో 41.4 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పంటలకు రోగాల సమస్య తీరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం పట్టణంలోని చంద్రవౌళేశ్వరస్వామికి మహాకుంభాభిషేకం నిర్వహించడంతో వరుణుడు కరుణించాడని ప్రజలు విశ్వసిస్తున్నారు.
వంగపేరు పరవళ్లు..
కొత్తచెరువు : మండల పరిధిలోని భైరాపురం, బండ్లపల్లిలతోపాటు వంగపేరు పరివాహక ప్రాంతమైన శెట్టిపల్లి, గాజులపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురియడంతో వంగపేరు పరవళ్లు తొక్కింది. వంగపేరుకు అడ్డంగా నిర్మించిన 20 చెక్‌డ్యాంలు నిండాయి. రైతులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో వేరుశెనగ పంటకు సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని హర్షిస్తున్నారు. ఇదే తరుణంలో చెక్‌డ్యాంలు సైతం నిండడంతో భూగర్భ జలాలు కూడా పెరిగి బోరుబావుల్లో నీరు పెరగడంతో వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేసేందుకు వీలుగా వుండడంతో రైతుల్లో మరింత ఆనందం వెల్లివిరుస్తోంది.