అనంతపురం

2019లో అధికారమే లక్ష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలుపుల, జూలై 26: 2019లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుని బిజెపి కార్యకర్తలు పనిచేయాలని జిల్లా బిజెపి అధ్యక్షులు అంకాల్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశానికి ఆయనతోపాటు బిజెపి దళితమోర్చా ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రొద్దం ఉత్తమరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతులు, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలుచేయడం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని పలు పథకాలను సబ్సిడీతో అందిస్తోందన్నారు. రైతుల ఇబ్బందులు దృష్టిలో వుంచుకుని పసల్ బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అంతేగాక వేరుశెనగ, చెరకు పంటలకు బీమా వర్తింపజేసే విషయమై చర్చించేందుకు రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమరెడ్డి తెలిపారు. రైతులు కేవలం 1.5శాతం ప్రీమియం చెల్లిస్తే చాలన్నారు. అటల్ పెన్షన్ యోజనలాంటి పథకాలు ఎన్నో వున్నాయన్నారు. వీటి గురించి ప్రతి గ్రామంలోను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై వుందన్నారు. అంతేగాక గ్రామస్థాయిలో పార్టీని పటిష్టపరచాలని మండల కమిటీని ఆదేశించారు. అంతేగాక గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందజేయడం జరుగుతోందన్నారు. కేవలం రూ. 1160లు మాత్రమే గ్యాస్‌కు, రెగ్యులేటర్‌కు చెల్లించాల్సి వుందన్నారు. రసాయనిక ఎరువుల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు కొట్టె శ్రీరాములును జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి దుశ్శాలువ కప్పి సన్మానించారు. ఇదే సందర్భంలో కదిరికి చెందిన డిఎల్ ఆంజనేయులును బిజెపి జిల్లా కార్యదర్శిగా నియామక పత్రాలు అందజేశారు. సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి డిఎల్ ఆంజనేయులు, కదిరి అసెంబ్లీ ఇన్‌చార్జి నాగేంద్రప్రసాద్, జిల్లా యువమోర్చా అధ్యక్షులు హరీష్‌రెడ్డి, నాయకులు రామక్రిష్ణ, రాజశేఖరబాబు, మండల కన్వీనర్ ఎద్దుల రమణయ్య, కార్యదర్శి గంగారాజు, బాలఉగ్రం, గంగరాజు, సుబ్బయ్య పాల్గొన్నారు.