అనంతపురం

పంట సంజీవని అమలుకు ప్రత్యేక యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 26: వేరుశెనగ పంటకు రక్షక తడులను అందించి కాపాడే పంట సంజీవని కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. మంగళవారం రెవిన్యూ భవన్‌లో వ్యవసాయ అధికారులకు పంట సంజీవనిపై వర్కుషాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను కరవు రహిత జిల్లాగా మార్చేందుకు సిఎం కృతనిశ్ఛయంతో ఉన్నారన్నారు. జిల్లాలో 4.8 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంటను రైతులు సాగుచేస్తున్నారన్నారు. ఈ వేరుశెనగ పంటను కాపాడేందుకు గత డిసెంబర్ నుండి లక్ష ఫారంపాండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాదాపు 50శాతం పైగా పూర్తిచేశామన్నారు. వేరుశెనగ పంట 100 రోజుల కాల పరిమితిలో చేతికి వస్తుందన్నారు. కీలక దశలో వర్షాలు పడని సమయంలో సమీపంలో బోరు బావులు నుండి లేదా ఫారంపాండ్ల నుండి రెయిన్‌గన్లను ఉపయోగించి పంటను కాపాడుతామన్నారు. దీనిని పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఆండ్రాయిడ్ వర్షన్‌లో ఇది ట్యాబ్, స్మార్ట్ఫోన్లనందు పనిచేస్తుందని తెలిపారు. పంట వేసిన నాటి నుండి 35-40 రోజుల్లో నీటిని అందించకపోతే ఎవరి పొలంలో రెయిన్‌గన్ ద్వారా నీటిని అందించామన్న విషయం యాప్ ద్వారా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఏ మండలం, ఏ గ్రామంలో రైతు పొలం తదితర విషయాలు తెలిసేలా యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. వేరుశెనగ విత్తనాలను సాంకేతిక విజ్ఞానాన్ని జోడించి బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేసి జిల్లాకు మంచి పేరు రావడంతో అందరి దృష్టి మనపై కేంద్రీకృతమైందని, చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, అగ్రికల్చర్ జెడి శ్రీరామమూర్తి, ఎపిఎంఐపి, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఎంపిఈఓలు, ఏఓలు పాల్గొన్నారు.