జాతీయ వార్తలు

అక్రమంగా భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతుల నుండి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా భూములు తీసుకుంటోందని కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ మంగళవారం రాజ్యసభలో ఆరోపించారు. రాజ్యసభ జీరో అవర్‌లో మల్లన్నసాగర్ రైతుల సమస్యల గురించి ప్రస్తావించేందుకు డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్‌తో ఖాన్ వాగ్వివాదానికి దిగారు. మీరిలా గొడవ చేస్తే సభ నుండి బయటకు పంపించాల్సి వస్తుందని కురియన్ హెచ్చరించినా ఖాన్ మాత్రం మల్లన్నసాగర్ రైతుల సమస్యలు ప్రస్తావించేందుకు తనకు సమయం ఇవ్వాలంటూ పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. రాజ్యసభ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే ఎం.ఏ.ఖాన్ లేచి మల్లనసాగర్ ప్రాజెక్టు రైతుల సమస్య అంశాన్ని ప్రస్తావించారు. తన అనుమతి లేకుండా ఎలా మాట్లాడుతారని కురియన్ ఆయనను ప్రశ్నించారు. మీరు ఇష్టానుసారం వ్యవహరించటం మంచి పద్ధతి కాదని ఒక దశలో కురియన్ హెచ్చరించినా ఖాన్ పట్టించుకోలేదు. మీరు జీరో అవర్‌లో మాట్లాడేందుకు నోటీసు ఇచ్చారా? అని కురియన్ ప్రశ్నించినా ఖాన్ తన ధోరణిలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండి భూమి తీసుకుంటోందనీ, అడ్డుకుంటున్న వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ దశలో కురియన్ కల్పించుకుని మీరు నోటీసు ఇచ్చారా అని ప్రశ్నించారు. జీరో అవర్ నోటీసు నిన్ననే ఇచ్చానని ఖాన్ బదులిచ్చారు. మీరిచ్చిన నోటీసు ఇక్కడ లేదు, నోటీసు ఇచ్చి ఉంటే మీరొకసారి రాజ్యసభ చైర్మన్‌ను కలుసుకుని మాట్లాడుకోవాలని కురియన్ సూచించారు. దీనికి ఆగ్రహం చెందిన ఖాన్ పోడియం వద్దకు వచ్చి ఆయనతో వాదనకు దిగారు. నోటీసు ఇచ్చినా మాట్లాడేందుకు ఎందుకు అనుమతించటం లేదంటూ ప్రశ్నించారు. మీరిలా పోడియం వద్దకు రావటం మంచిది కాదని కురియన్ హెచ్చరించటంతో ఖాన్ తన సీటులోకి వెళ్లటంతో పరిస్థితి సద్దుమణిగింది.