జాతీయ వార్తలు

రాష్ట్రాల ఆందోళనకు పరిష్కారం ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 26: జిఎస్‌టి బిల్లుకు సంబంధించి రాష్ట్రాలు చేసిన అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం విజ్ఞన్‌భవన్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన సాధికరిక కమిటీ సమావేశంలో యనమల మాట్లాడారు. ఈ బిల్లుపై రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు కేంద్రం పరిష్కారాన్ని అందించలేదన్నారు. ముఖ్యంగా ఇందులోని 19వ నిబంధన రాష్ట్రాల్లో అనుమానాలను తలేత్తెలా చేస్తోందన్నారు. రాష్ట్రాలు ఐదేళ్లపాటు ఎలాంటి పరిహారం పొందలేవన్నది ఈ నిబంధన సారంశం అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాధికరిక కమిటి చేసిన సిఫార్సులను బిల్లులో పొందుపరచలేదని, ఇందుకు కారణమేమిటో కూడా వివరించలేదన్నారు. అలాగే సీఎస్టీ పరిహారాన్ని పొందే విషయంలోనూ ఆయా రాష్ట్రాలు చేదు అనుభవానే్న చవిచూశాయన్నారు. సీఎస్టీ పరిహారాన్ని నిర్ణీత కాలవ్యవధితో నెలనెలా లేదా త్రైమాసికంగా ఒక్కసారి చెల్లించాలన్నారు. ప్రామాణిక రేటును 14.5 శాతం నుంచి 9శాతానికి తగ్గించిన కారణంగా రూ.4700 కోట్ల రూపాయల మేర తమ రాష్ట్రం నష్టపోయిందన్నారు.