మెదక్

వైభవంగా దుర్గమ్మ జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 29: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని దుర్గమ్మతల్లి జాతర మహోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) సమక్షంలో అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ శివారులోని దుర్గమ్మతల్లి ఆలయ ఆవరణలో జరిగిన రధులు రంగాలు (జాతర)లో జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సదాశివపేటలో జరిగిన బోనాల ఉత్సవాల్లో సైతం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.