హైదరాబాద్

ఎంసెట్ లీక్‌పై భగ్గుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని ర్యాంకర్లు..తల్లిదండ్రులు శుక్రవారం నిర్వహించిన ఆందోళనలు..నిరససనల సెగ ఇందిరాపార్కుకూ తాకింది. తొలుత సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు పోలీసులు అడ్డుకోవటంతో ర్యాంకర్లు, తల్లిదండ్రులు ఎవరికి వారు వేర్వేరుగా ఇందిరాపార్కుకు చేరుకున్నారు. దాదాపు వంద మంది జమయ్యి ధర్నాకు ఉపక్రమించగా అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. ఓదశలో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పోలీసులు అరెస్టుమ పర్వం కొనసాగించారు. దాదాపు అరవై మందిని అరెస్ట చేసి ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు తల్లిదండ్రులు మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడటం మంచిది కాదనీ, అవకతవకలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలి కానీ..అందరిపై వేటు వేయటం అన్యాయమన్నారు. ర్యాంకులు..రిజల్ట్స్ మళ్లీ వస్తాయా..ఇంత కష్ట పడి చదివిందీ వృథా కావల్సిందేనా అని వాపోయారు. అందరినీ భాద్యులను చేయవద్దు, మళ్లీ పరీక్షలను నిర్వహించవద్దు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్థం
సికింద్రాబాద్: తెరాస ప్రభుత్వం పూర్తిగా అవినీతితో కూరుకుపోయి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం టిఎన్‌ఎస్‌ఎఫ్ నగర అధ్యక్షుడు రఘుకిరణ్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిలుక మాట్లాడుతూ తెలంగాణలో ఎమ్సెట్-2 లీక్ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలను దర్భరం చేస్తూ వరుసగా ఎమ్సెట్‌లు నిర్వహిస్తూ లీక్‌లకు పాల్పడుతున్న ఈ అసమర్థ ప్రభుత్వంలోని పెద్దమనుష్యుల వ్యవహారాన్ని సిబిఐతో విచారణ చేయిస్తే బహిర్గతమవుతుందని అన్నారు. సిఐడితో విచారణ జరిపించి తూతూ మంత్రంగా కొంతమందిని బాధ్యులుగా చిత్రీకరించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని అన్నారు. తమది పారదర్శక ప్రభుత్వమంటే ఏమో అనుకున్నామని ఇలా ప్రశ్నాపత్రాలను కూడా బహిర్గతం చేసి సొమ్ము చేసుకునే ప్రభుత్వమనుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే విద్యార్థులు ఎమ్సెట్ విషయంలో ఆది నుంచి తీవ్ర గందరగోళాన్ని ఎదుర్కొన్నారన్నారు. రెండు నీట్ పరీక్షలు, రెండు ఎమ్సెట్ పరీక్షలు రాశారని అన్నారు. ఎట్టకేలకు సమస్య సమిసిపోయిందనుకుంటున్న తరుణంలో కొంతమంది అవినీతి అధికారులు, పాలకుల కారణంగా మరోసారి విద్యార్థుల జీవితాలతో అంధకారం నెలకొందని అన్నారు. ఇందుకు ముందుగా నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి డాక్టర్.లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, జెఎన్‌టియు రమణారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో తప్పుజరిగితే తల నరుక్కుంటానని శపధం చేసిన సిఎం గత వారం రోజులుగా కుప్పలుతెప్పలుగా బయటపడుతున్న అవినీతి కుంభకోణాల పట్ల ఇప్పటివరకు నోరు మెదకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతికి బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించి అమాయక విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని చిలుక డిమాండ్ చేశారు. లీక్ వ్యవహారంలో సిఐడితో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని లేనిపక్షంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థులు పెద్దయెత్తున హాజరయ్యారు.
సచివాలయ ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ నేతల అరెస్టు
ఖైరతాబాద్: లీకేజి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ముట్టడికి యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ సచివాలయం వద్దకు రాగానే పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కోటా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వంలో కొనసాగుతున్న కొందరి అవినీతివల్లే ఎంసెట్ -2 పేపర్ లీక్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావి భారత వైద్యులను తయారు చేసేందుకు నిర్వహించిన ప్రశ్నాపత్రం లీకు కావడం ఎంతో దుర్మార్గమని, దొడ్డిదారిన ర్యాంకులు పొందిన వారు వైద్యం ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను పదవుల నుంచి తొలగించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులని తేలిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, విద్యార్ధులు తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం కేసిఆర్ ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించక పోవడం హేయమైన చర్య అని, విద్యార్థులకు న్యాయం చేయక పోతే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు సచివాలయం ముందు నిరసన తెలిపేందుకు వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి స్టేషన్‌కు తరలించారు.