అనంతపురం

హరేసముద్రం చిన్న చెరువుకు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 29 : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని చిన్న చెరువుకు గండి పడింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు చెక్‌డ్యాంలు, నీటి కుంటలు నిండగా వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. హరేసముద్రం చిన్న చెరువు కింద ఉన్న ఆయకట్టదారులు చెరువులో నీరు లేకపోయినా వర్షాలతోనైనా దిగుబడులు వస్తాయని మొక్కజొన్న, రాగి వంటి పంటలు సాగు చేశారు. అయితే వర్షాలు కురవడంతో చెరువులోకి నీరు రావడంతో దిగుబడిపై రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. పంట మరో 30 రోజుల్లో కోత వస్తుండగా చెరువుకు గండి పడటంతో పొలాల్లోకి నీరు చేరి పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు జయరాం, గంగప్ప, నాగరాజు, తిమ్మప్ప ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాలకు చెరువులోకి నాలుగు నెలల నీళ్లు చేరాయని, చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుని గండికి మరమ్మతులు చేస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు అంటున్నారు. విషయం తెలుసుకున్న ఎంపిటిసి అశ్వర్థరామప్ప, ఆయకట్ట సంఘం సభ్యులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిఇ వేణుగోపాల్, ఎఇ శ్రీనివాసులు హుటాహుటిన గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. గండి పూడ్చేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని, చెరువుకు చేరిన నీటిని నిలువ చేసి ఆయకట్ట రైతులకు అదేవిధంగా చూస్తామని అధికారులు తెలిపారు.