క్రీడాభూమి

స్విమ్మర్ లొబిత్సెవ్‌పై కొత్త ఆంక్షలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జూలై 30: రష్యా స్విమ్మర్ నికిటా లొబిత్సెవ్‌పై కొత్త ఆంక్షలేవీ లేవని, అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (్ఫనా) ఇప్పటికే అతనిని రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా సస్పెన్షన్ వేటు విధించిందని అమెరికా డోపింగ్ నిరోధక విభాగం (యుఎస్‌ఎడిఎ) స్పష్టం చేసింది. తాజా డోప్ పరీక్షలోనూ లొబిత్సెవ్ విఫలమయ్యాడని తెలిపింది. అయితే, ఫినా అతనిని రెండేళ్లపాటు సస్పెండ్ చేసిందని, ఒలింపిక్స్‌లో పాల్గొనరాదని ఆదేశించిందని యుఎస్‌ఎడిఎ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో, డోప్ పరీక్షలో విఫలమైన కారణంగా మరోసారి అతనిని సస్పెండ్ చేసే ఆలోచనగానీ, కొత్తగా ఆంక్షలు విధించాలన్న అభిప్రాయం కానీ లేదని తెలిపింది. ‘బి’ శాంపిల్‌ను పరీక్షించాల్సిన అవసరం కూడా లేదని తేల్చిచెప్పింది.