క్రీడాభూమి

రష్యా వెయిట్‌లిఫ్టింగ్ జట్టుపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 30: రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. డోపింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా, తాజాగా వెయిట్‌లిఫ్టర్లు కూడా ఈ జాబితాలో చేరారు. ఫలితంగా మొత్తం వెయిట్‌లిఫ్టింగ్ జట్టుపైనే వేటు పడింది. రష్యా లిఫ్టర్లు పదేపదే డోపింగ్ పరీక్షలో విఫలమవుతున్నారని, అందుకే, ఎనిమిది మంది సభ్యులతో కూడిన మొత్తం జట్టుపై అనర్హత వేటు తప్పలేదని అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యుఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ క్రీడా రంగాన్ని కుదిపేసిన రష్యా వ్యూహాత్మక డోపింగ్ దుష్ఫలితాలు ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చాయి. సుమారు ఏడాది కాలంగా రష్యా వ్యూహాత్మక డోపింగ్ అంశం ప్రకంపనలకు కారణమైంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో ఎక్కువ పతకాలను సాధించి, అగ్రస్థానాన్ని ఆక్రమించాలన్న ఏకైక లక్ష్యంతో రష్యా అడ్డదారులు తొక్కింది. ప్రభుత్యమే ఉద్దేశంతో అథ్లెట్లకు ఉత్ప్రేరకాలను ఇచ్చి, ప్రోత్సహించిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ స్పష్టం చేసినప్పుడు క్రీడాలోకం విస్తుపోయింది. ఆ కమిటీ సమస్త వివరాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టడంతో రష్యా ఎటూ తప్పించుకోలేని సంకట స్థితిని ఎదుర్కొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా, రష్యాను ఒలింపిక్స్ నుంచి నిషేధించాలన్న డిమాండ్ బలాన్ని సంతరించుకుంటున్నది. దీనికితోడు డోప్ టెస్టులో వందకుపైగా క్రీడాకారులు పట్టుబడి నిషేధాన్ని ఎదుర్కోవడం రష్యా ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. ఒక దేశ ప్రభుత్వమే అథ్లెట్లకు డోపింగ్‌ను అలవాటు చేయడం ప్రపంచ క్రీడా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. రియో ఒలింపిక్స్ దగ్గరపడుతున్న కొద్దీ రష్యా డోప్ దోషుల జాబితా పెరిగిపోతున్నది. డోపింగ్ రహిత ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) ఒకవైపు ప్రటిస్తుంటే, మరోవైపు రష్యా డోప్ కేసులు పెరగడం విశేషం.
నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వినియోగించినట్టు రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా స్వయంగా చేసిన ప్రకటనతో అక్కడ డోపింగ్ ఏ స్థాయిలో జరుగుతున్నదనే విషయాన్ని స్పష్టం చేసింది. వ్యూహాత్మక డోపింగ్‌కు రష్యా సర్కారు, అధికారులు పాల్పడుతున్నారన్న వాడా కమిటీ నివేదికకు ప్రస్తుత పరిణామాలు బలాన్నిస్తున్నాయి. డోపింగ్ కేసుల్లో ఆయా క్రీడాకారులకు వ్యక్తిగతంగానేక, సమష్టి బాధ్యత కూడా ఉంటుందని తేల్చిచెప్పిన ఐడబ్ల్యుఎఫ్ ఈ కారణంగానే రష్యా వెయిట్‌లిఫ్టింగ్ జట్టు మొత్తాన్ని ఒలింపిక్స్ నుంచి నిషేధించినట్టు తెలిపింది. రష్యా లిఫ్టర్ల డోప్ పరీక్షా ఫలితాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది.