ఖమ్మం

రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కేంద్రాలతో ప్రజలకు ‘మీ సేవ’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, జూలై 31: తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 4వేల మీసేవ కేంద్రాలతో ప్రజలకు వివిధ రకాల సేవలను అందజేస్తున్న ఇఎస్‌డి డెప్యూటి డైరెక్టర్ ఆఫ్ పైనాన్స్ ఎన్ మధుసూదనరెడ్డి వెల్లడించారు. ఆదివారం నేలకొండపల్లిలోని ఉత్తరేశ్వరస్వామి దేవాలయం నందు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 110 ప్రభుత్వ కేంద్రాలు, ప్రాంజేస్ కేంద్రాలుగా 4వేలు మీసేవ సెంటర్‌లు ప్రజలకు సేవాలను అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ పరమైన సేవాలను ప్రజలకు అందించేందుకు మీసేవాలు కృషిచేస్తూన్నాయన్నారు. సాదాబైనామ, ఆసరా పెన్షన్ వేలి ముద్రలలో నెలకొన్న సాంకేతిక పరమైన సమస్యలను తొలగించిన్నట్లు తెలిపారు. ప్రజలకు వాటి విషయంలో చివరి తేదీ అని తెలియటం వల్ల కొంత ఇబ్బందిపడ్డారన్నారు. కాని వాటికి చివరి తేదీ అనేది లేదని ఏప్పుడైనా నమోద్ చేసుకోవచ్చన్నారు. మీసేవా కేంద్రాలలో దాదాపు 540 సేవలను అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో 51 సెంటర్‌లలో దాదాపు వేయి మొక్కలను నాటినట్లు చెప్పారు. అలాగే మిగిలిన 8 జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రజలు, అధికారుల సహకారంతో సుమారు 10 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక చేసిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, ఎఓ శివాజి గణష్, సిడిఎం దుర్గాప్రసాద్, లక్ష్మణ్‌రావు, యుగేంధర్, రాకేష్‌శర్మ, రామకృష్ణ, సురేష్, నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ రాజపుత్ర శ్రీనివాససింగ్, భక్తరామదాసు సొసైటి అధ్యక్షుడు అర్వపల్లి రామరావు, శ్రీనివాసరావు, ఈగ వెంకటేశ్వరరావు, కంకిపాటి శ్రీనివాసరావు, అనిల్, దోసపాటి చంద్రశేఖర్, స్థానిక వసుందర కాలేజి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.