కర్నూల్

ప్రజా ప్రయోజనాల కోసమే బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 31:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది రాజకీయ లబ్ధి కోసం కాదని, ప్రజా ప్రయోజనాల కోసమే అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా గౌరుతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే అన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గతంలో పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు. అయితే ఇప్పుతు రాజ్యసభలో ప్రత్యేక హోదా తీర్మానాన్ని తోసిపుచ్చడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా వల్ల విద్య, వైద్య, పారిశ్రామిక తదితర అంశాలు సమకూరటమే కాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక హోదా గురించి అటు బిజెపి, ఇటు టిడిపిలను పలుమార్లు సంప్రదించినా వారు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు-నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2వ తేదీ జగన్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారని, ఆ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వైకాపా నగర కన్వీనర్ నరసింహులుయాదవ్, నాయకులు తెర్నెకల్ సురేంద్రరెడ్డి, సిహెచ్.మద్దయ్య, జహీర్‌అహమ్మద్‌ఖాన్ పాల్గొన్నారు.