హైదరాబాద్

ప్రభుత్వ వైఫల్యంతోనే ఎంసెట్-2 లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఆగస్టు 1: ప్రభుత్వ వైఫల్యంతోనే ఎంసెట్-2 లీకేజీ అయిందని తెలంగాణ ఉద్యమ వేదిక విమర్శించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక నాయకులు చెరుకు సుధాకర్, యన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐచే విచారణ జరిపించి దోశులను శిక్షించాని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు మరో మారు పరీక్ష రాయాలంటే తీవ్ర ఒత్తిడికి గురవుతారని చెప్పారు. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసన తెలుపుతుంటే వారిని సైతం అరెస్టులు చేయడం విచారకరమని అన్నారు. సిఐడి విచారణలో దోషులంతా ఏపికి చెందినవారే అనడం సిగ్గుచేటని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఎసెంట్‌ను ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఎలా లీక్ చేస్తారని ప్రశ్నించారు. ఇక్కడి వారి సహకారం లేకుండానే పేపర్ లీక్ అవుతుందా అని దుయ్యబట్టారు.
పేపర్ లీకేజీకి కారణమైన మంత్రులను వెంటనే బర్త్ఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు తప్పు చేశాడంటూ మంత్రి వర్గం నుంచి రాజయ్యను తొలగించినట్టుగానే వీరిని సైతం తొలగించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. పరీక్షను పూర్తిగా రద్దు చేయకుండా లీకేజీతో లబ్ధిపొందిన వారి ర్యాంకులను రద్దు చేసి మిగిలిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.