అనంతపురం

ఎంత పనిచేశావు తల్లీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, ఆగస్టు 1: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకుందన్న వార్తతో బుక్కరాయసముద్రం పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లి గ్రామం ఉలిక్కిపడింది. సోమవారం తెలతెలవారుతుండగానే ఈ వార్త దావనలంలా వ్యాపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భారతి(25) కుటుంబ సమస్యలను సాకుగా తీసుకుని కూతురు మహాలక్ష్మి(6), కుమారుడు(6 నెలలు)కి విషమిచ్చి చంపి తరువాత సూసైడ్ నోట్ రాసి అనంతరం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుక్కరాయసముద్రం ఎస్‌ఐ విశ్వనాథచౌదరి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆనంద్‌రెడ్డితో నెల్లూరు జిల్లాకు చెందిన భారతి వివాహం 7 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పులు ఎక్కువ కావడంతో బాధపడుతున్న భర్తను చూసి మానసిక ఆందోళనకు గురైన ఆమె జీవితంపై విరక్తి కలిగి తన ఇద్దరు పిల్లలను తానే విషమిచ్చి చంపి తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయంలో ఎవరి ప్రమేయం లేదని తన భర్తకు ఏ పాపం తెలియదని మద్యంమత్తులో నిద్రిస్తున్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఆనంద్‌రెడ్డికి చేతికి గాయాలు
కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఆనంద్‌రెడ్డినిమాట్లాడుతూ ఆటో తోలుకుని జీవనం సాగిస్తున్నానని, చేసిన అప్పులు తీర్చలేక మద్యానికి బానిసగా మారానన్నారు. తన తండ్రి గంగిరెడ్డి అనారోగ్యంతో వారం రోజుల క్రితం మృతి చెందాడన్నారు. ఉన్న ఇల్లు అమ్మిదిక్కుతోచని పరిస్థితిలో ఆదివారం రాత్రి మద్యం ఎక్కువగా తాగి ఇంటి కిటికీ తలుపును పగలగొట్టి తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో పెదనాన్న కొడుకులు, గ్రామస్థులు మందలించి రాత్రి 11గంటల సమయంలో ఇంటి వద్ద వదిలి పోయారని తెలిపాడు. తిరిగి ఉదయానే్న లేచే సరికి ఈ దారుణం జరిగిపోయిందని తెలిపాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని బుక్కరాయసముద్రం ఎస్‌ఐ విశ్వనాథచౌదరి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని బుక్కరాయసముద్రం ఎస్‌ఐ విశ్వనాథచౌదరి దర్యాప్తు చేస్తున్నారు.
మూడో వారంలో
కాలువలకు నీరు విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, ఆగస్టు1:తుంగభద్ర జలాశయం నుంచి నీటి కేటాయింపులకు సంబంధించి తుంగభద్ర ఎగువ కాలువ పథకం పరిధిలోని మూడు జిల్లాలకు (అనంతపురం, కడప, కర్నూలు) ఈ నెల మూడో వారంలో లభ్యతను బట్టి నీటిని విడుదల చేయాలని నీటి పారుదల సలహా మండలి (ఐఎబి) సమావేశం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టు 22వ తేదీ నీటిని విడుదల చేయగా, ఈ ఏడాది నిర్ధిష్ట తేదీ ఖరారు కానందున సమావేశంలో ప్రకటించలేదు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఐఎబి చైర్మన్, కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, చీప్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, శాసనమండలి డెప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, జడ్పీచైర్మన్ చమన్, హెచ్చెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అనంతపురం ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి, కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బికె.పార్థసారథి, జెసి.ప్రభాకరరెడ్డి, జితేందద్రగౌడ్, వై.విశే్వశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాసా, ఉన్నం హనుమంతరాయచౌదరి, సూర్యనారాయణ, ఆలూరు (కర్నూలు జిల్లా) ఎమ్మెల్యే జయరామ్, ఎమ్మెల్సీలు శమంతకమణి, మెట్టు గోవిందరెడ్డి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, గుత్తి బ్రాంచి కెనాల్, ఆలూలు బ్రాంచి కెనాల్‌లకు ఖరీఫ్ కోసం ఆగస్టు 3వ వారంలో, మధ్య పెన్నార్ దక్షిణ కాలువకు, ఉత్తర కాలువ, తాడిపత్రి బ్రాంచి కెనాల్, పులివెందుల బ్రాంచి కెనాల్‌కు రబీలో అక్టోబర్ మూడో వారంలో నీటిని విడుదల చేయాలని సమావేశం నిర్ణయించింది. ఇక మైలవరం జలాశయానికి, పెన్నానదిలో అనుకూల పరిస్థితులను బట్టి ఎంపిఆర్ వద్ద నీటిని విడుదల చేయనున్నారు. తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ అవసరాల కోసం 10 టిఎంసిలు కేటాయించాలని, అనధికారిక సాగు(వరి తదితరాలు)ను పూర్తిగా అరికట్టాలని, ఆరు తడి పంటల్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. నీటి నష్టాలను మినహాయించి.. హైలెవల్ మెయిన్ కెనాల్‌కు 1.992 టిఎంసిలు, గుంతకల్లు బ్రాంచి కెనాల్‌కు 1.875, మధ్య పెన్నార్ జలాశయం కింద(అనంతపురం జిల్లా) 2.692, కడప జిల్లాకు 2.285 టీఎంసిలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సాగునీటి అవసరాలకు 8.844 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 6.726 కేటాయించారు. ఈ మేరకు నికరంగా 15.570 టి ఎంసీలు కేటాయించేలా నిర్ణయించారు. ప్రవాహం, ఇతరత్రా నష్టమయ్యే 7.579 టీ ఎంసీలు కలిపి మొత్తంగా 23.149 టీ ఎంసీలు తుంగభద్ర డ్యామ్ వద్ద కేటాయించనున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు.
ప్రోరేటా ప్రకారం నీటి విడుదల : మంత్రులు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, ఆగస్టు1: ఈ ఏడాది హెచ్‌ఎల్‌సీ ద్వారా విడుదల చేసే నీటిలో తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత తెలిపారు. ప్రోరేటా ప్రకారం నీరందిస్తామని వారన్నారు. తాగునీటి కోసం పిఎబిఆర్‌లో 2.7 టి ఎంసీలు, ఎంపిఆర్‌లో 0.5 టీఎంసీలు, సీబీఆర్‌లో 2.01 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో సోమవారం జరిగిన నీటి పారుదల సలహా మండలి (ఐఎబి) సమావేశం ప్రారంభంలో కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో ఆశించిన మేర లేవని, కానీ సమీప భవిష్యత్తులో ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు మాట్లాడుతూ ఈ ఏడాది ప్రాజెక్టులో 151 టీఎంసీలు సేద్యం నీటి అవసరాలకు లభ్యమవుతుందని అంచనా వేసి, హెచ్చెల్సీకి 23.149 టీఎంసీలు తుంగభద్ర బోర్డు సమావేశంలో కేటాయించారన్నారు. అందులో 10 టిఎంసీలు తాగునీటి అవసరాలకు, మిగిలిన 13.149 టీఎంసీలు సాగునీటి కోసం వినియోగించుకోవచ్చన్నారు. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ నికరంగా తాగునీటి అవసరాలకు 6.726 టీఎంసీలు పంటల సాగుకు 8.994 టీఎంసిలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ఏడాది హెచ్చెల్సీ కింద అనంతపురం జిల్లాలో 81వేల ఎకరాలకు, ఆలూరు బ్రాంచి కెనాల్ కింద 3వేల ఎకరాలు, పులివెందుల బ్రాంచి కెనాల్ కింద 6వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. టిబి డ్యామ్ పూర్తిగా నిండి 23.149 టీఎంసీలు హెచ్చెల్సీకి వస్తాయని ఆశిస్తున్నామని ఎస్‌ఈ అన్నారు. తొలుత తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్య ఇచ్చాకే, సాగునీటికి నీరివ్వాలని చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అధికారులను కోరారు. ఎంపి జెసి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ అనధికారిక వరి సాగును అరికట్టేందుకు అధికారులు కఠినంగా వ్యవహరించాలని, అపుడే చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందుతుందని అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేయరాదన్నారు. ఇక నీటి అక్రమ వాడకాన్ని నిరోధించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకలైజ్డ్ ఆయకట్టుకు నీరందించాలని ఎంపి కోరారు. అనధికారిక వరి సాగును అరికట్టేందుకు గత ఏడాది చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ ఎగువన ఉన్న వారు నీటిని అక్రమంగా వినియోగించుకోవడం వల్ల తాడిపత్రి, శింగనమల ప్రాంతాల్లోని ఆయకట్టుకు గత కొనే్నళ్లుగా సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తాగునీటిని సైతం రవాణా చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈసారైనా తమ శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు నీటి కొరత లేకుండా చూడాలని విప్ యామినీబాల కోరారు. ఈ మండలాల్లో తాగునీటికి, సాగునీటికి అవస్థలు పడుతున్నామన్నారు. నీటిని సమంగా పంచండి లేదా, పై నుంచి కిందకు ఏకరూపంగా నీటినివ్వండి, శింగనమలకు న్యాయం చేయండి అని కోరారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దిగువలకు వెళుతున్న హెచ్చెల్సీ నికర జలాలను వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి సూచించారు. గుండ్రేవుల వద్ద ప్రాజెక్టు కడితే హంద్రీ నీవాకు 79 కిలోమీటరు వద్ద నుంచే నీటిని పంపింగ్ చేయవచ్చని, కెసి కెనాల్ ఆయకట్టును స్థిరీకరించవచ్చని కడప ఎంపి అవినాష్‌రెడ్డి అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారన్నారు. ఆ ప్రాజెక్టు వివరాలను తమకు అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఒప్పించే ప్రయత్నం చేస్తామని కలెక్టర్‌ను జెసి దివాకర్‌రెడ్డి కోరారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ డిప్యూటీ ఎస్‌ఈ శ్రీనివాసులు మాట్లాడుతూ హెచ్చెల్సీ నుంచి తాగునీటికి 10 టీఎంసీల నీటిని వాడుకుంటున్నందున సాగునీటికి ఇబ్బంది ఎదురవుతోందన్నారు. కనుక రాష్ట్రానికి కేటాయించే కృష్ణా జలాల వాటాలోనే తాగునీటికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసేలా ప్రయత్నిస్తే సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో నీటిని వాడుకోవచ్చని సూచించారు. బచావత్ అవార్డులో హెచ్చెల్సీకి 32.5 టీ ఎంసీలతో పాటు బిటిపికి 5 టిఎంసీలు కేటాయించారని వివరించారు. ఆ వివరాలను పొందుపరుస్తూ తమకు నివేదిక అందిస్తే ఈ నెల 6న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అన్నారు.