అనంతపురం

ఘనంగా చౌడేశ్వరి అమ్మవారి జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఆగస్టు 2 : ఆషాడ అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం మున్సిపల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో వెలసిన చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా మూల విరాట్ ఎదురుగా అఖండ దీపాన్ని ఏర్పాటు వెలిగించారు. తొగట వీర కులస్థులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ అర్చకులు లింగం ఓబయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మద్దనజయరాములు, పల్లా లక్ష్మీకుమార్, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.