హైదరాబాద్

పాఠాలతో ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: భవన నిర్మాణ రంగంలో నాణ్యత, ప్రమాదాలు జరగకుండా పాటించాల్సిన భద్రతపరమైన అంశాలపై సైటు ఇంజనీర్లకు, సూపర్‌వైజర్లకు తగిన శిక్షణనివ్వనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన నేతృత్వంలో జరిగిన సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనాలు కూలి పలువురు మృతి చెందిన ఘటనల నేపథ్యంలో ఆయన బుధవారం జెఎన్‌టియు, న్యాక్, క్రెడాయి, టి క్రెడాయి, ఎల్ అండ్ టి, టాటా, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటనలు కేవలం కాంట్రాక్టర్లు, బిల్డర్లు, సైటు ఇంజనీర్లు, సూపర్‌వైజర్ల తప్పిదం, నిర్లక్ష్యం వల్లే జరిగి అమాయకులైన కార్మికులు తమ విలువైన ప్రాణాలను కోల్పోవల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు సివిల్ ఇంజనీరింగ్‌లో సరైన పరిజ్ఞానం లేకపోవటం వల్లే జరిగాయని ఆయన పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే శరవేగంగా అభివృద్ధి పథంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగంలోని క్షేత్ర స్థాయి సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ ఏర్పాటుకు సంబంధించి మాడ్యుల్‌లను జెఎన్‌టియు సివిల్ ఇంజనీరింగ్ విభాగం రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షంను ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ శిక్షంలో న్యాక్‌తో పాటు నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖు సంస్థల సహాయసహకారాలు తీసుకోనున్నట్లు తెలిపారు. జోన్ల వారీగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకు గాను త్వరలోనే తగు మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్ల కమిషనర్ ప్రకటించారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు సైట్ ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, మేస్ర్తి తదితరులను నామినేట్ చేయాలని భవన నిర్మాణ ఏజెన్సీలకు కమిషనర్ సూచించారు. కాగా, క్షేత్ర స్థాయి భవన నిర్మాణ సిబ్బందికి శిక్షణను ఇవ్వాలన్న జిహెచ్‌ఎంసి నిర్ణయాన్ని భవన నిర్మాణ సంస్థల ప్రతినిధులు స్వాగతించారు.
కూకట్‌పల్లి ఘటనలో
బిల్డర్‌పై క్రిమినల్ కేసు
కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో కమాన్ కూలిన ఘటనకు బాధ్యులైన బిల్డర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయటంతో పాటు ఆ కమాన్ నిర్మాణానికి బాధ్యులైన ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీర్ల లైసెన్సు రద్దుకు షోకాజు నోటీసులు జారీ చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేవించారు. సర్వే నెంబర్ 145/2లో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి తీసుకున్నా, ఎంట్రెన్స్‌లో కమాన్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.