క్రీడాభూమి

తొలి రౌండ్లోనే జొకోవిచ్ ఇంటికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డీ జనీరో: పురుషుల టెన్నిస్ సింగిల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ రెండో రోజు గేమ్స్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన పోరులో జొకోవిచ్ 6-7(4/7), 6-7(2/7)తేడాతో డెల్ పాట్రో(అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో గోల్డెన్ స్లామ్ సాధించే అవకాశాన్ని జొకోవిచ్ జారవిడుచుకున్నాడు. ఉత్కంఠగా జరిగిన పోరులో రెండు సెట్ లూ టై బ్రేక్ కు దారి తీశాయి. పెట్రో దాటికి జొకోవిచ్ తలవంచతూ ఒలింపిక్స్ నుంచి భారంగా నిష్క్రమించాడు. లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో జొకోవిచ్ ను ఓడించిన డెల్ పోట్రో.. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు.