జాతీయ వార్తలు

విడుదల అన్యాయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలను తీవ్రంగా నిరశిస్తూ ఢిల్లీ వీధులు ప్రదర్శనలతో అట్టుడికాయి. ఆదివారం ఇండియా గేట్ వద్ద ప్రదర్శనకు వందలాది మంది ఈ తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్భయ తల్లిదండ్రులతో సహా అనేక మందిని ఇండియా గేట్ వద్ద పోలీసులు నిరోధించారు.
ఎప్పుడైతే బాల నేరస్థుడ్ని విడుదల చేశారన్న వార్తలు వెలువడ్డాయే అరగంట వ్యవధిలోనే ఇండియా గేట్ వద్దకు వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. విద్యార్థులు, ఎన్‌జిఓ కార్యకర్తలతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫలితంగా రాజ్‌పథ్ రోడ్డంతా ఆందోళనకారులతో నిండిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాల్ని దించారు.
మూడేళ్లుగా ఏం చేశారు?
బాల నేరస్థుడి విడుదలను నిరోధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చివరి క్షణం వరకు ఏం చేస్తున్నాయని నిర్భయ తల్లిదండ్రులు నిలదీశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆదివారం బాలనేరస్థుడు విడుదలైన నేపథ్యంలో రెండు ప్రభుత్వాలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని వుంటే ఈ బాల నేరస్థుడి విడుదల జరిగి వుండేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డ ఈ నేరస్థుడు విడుదల కాకూడదన్నదే మా న్యాయబద్ధమైన డిమాండ్. అసలు అతడి విడుదలనే ఆపలేనప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇతరత్రా విచారణ జరగడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి?’ అని నిర్భయ తల్లి నిలదీసింది. ‘ఈ నేరస్థుడు విడుదలవుతాడన్న విషయం ప్రతి ఒక్కరికీ చాలా ముందుగానే తెలిసినప్పుడు ఈ మూడేళ్ళు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంత హేయమైన నేరానికి పాల్పడ్డ వ్యక్తి బయటకు రాకుండా నిరోధించకుండా చట్టపరంగా ఎందు కు చర్యలు తీసుకోలేకపోయాయి?’ అని ప్రశ్నించింది. బాలనేరస్థుడు విడుదలపై తాను చేసేదేమీ లేదంటూ చివరి క్షణంలో ప్రభుత్వాలు చేతులెత్తేయడం పట్ల నిర్భయ తండ్రి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలను తీవ్రంగా నిరసిస్తూ ఆదివారం ఇండియా గేట్ వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్న మహిళలు