ఖమ్మం

బీసీల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* క్రీమీలేయర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
* బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య
ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం బీసీలను అణచివేసే విధంగా తీసుకున్న క్రీమీలేయర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీక్వెల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను అణచివేసేందుకు విభజించు, పాలించు అనే సూత్రాన్ని పాటిస్తుందని ఆరోపించారు. క్రీమీలేయర్ విధానంతో లక్షల బీసీ కుటుంబాలు నష్టపోతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. శాస్ర్తియత, హేతుబద్ధత లేని క్రీమీలేయర్ విధానం అవలంభిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌లో బీసీ కులాల సంఘాలతో, ఉద్యోగ, రాజకీయ సంఘాలతో అఖిలపక్షం నిర్వహిస్తామని, 26న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 27న హైదరాబాద్‌లో దీక్ష, 30న హైదరాబాద్‌లో బీసీ కులాలతో సమావేశం ఉంటుందన్నారు. 1993 నాటి ప్రభుత్వాలు క్రీమీలేయర్ విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నించిందని, నాడే విధానాన్ని ప్రతిఘటించామన్నారు. ఒక శాతం జనాభా ఉన్న కులం పరిపాలన చేస్తూ 52శాతం జనాభా ఉన్న బీసీ కులాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా హిజ్రాలను బీసీల్లో చేర్చేందుకు కెసిఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి బీసీల వ్యతిరేక విధానాలకు పాల్పడి బీసీల నుంచి నిరసనను ఎదుర్కొన్నారని, కెసిఆర్ తన వైఖరిని మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పిండిప్రోలు రామమూర్తి, కూరాకుల నాగభూషణం, నీలం వెంకటేశ్వర్లు, మధు, కృష్ణమాచారి, మధుగౌడ్, హరికిషోర్, షకీన, మహేష్ తదితరులు పాల్గొన్నారు.