ఖమ్మం

విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 28: జిల్లాల విభజనతో రాజకీయ ముఖచిత్ర కూడా మారుతున్నది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఉన్న 41 మండలాల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల హవా కొనసాగుతుండగా, కొత్త జిల్లా ఏర్పాటుతో అది సగానికి పడిపోనున్నది. అదే సమయంలో ఆయన అనుచరులుగా కొత్త జిల్లా పరిధిలో పని చేస్తున్న వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారనున్నది. ఖమ్మం జిల్లా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలుగా ఈ దసరా నుంచి విడిపోనున్న నేపథ్యంలో రాజకీయ చిరకాల ప్రత్యర్థులుగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావులు చెరో జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. దీంతో ఆయా జిల్లాల పరిధిలో వారి ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో మంత్రి హోదాలో తుమ్మల పెద్దగా పాల్గొన్న కార్యక్రమాలు కూడా లేవు. ఇదే వారిద్దరి మధ్య వైరుధ్యాన్ని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన పూర్తయితే ఖమ్మంకు తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెంకు జలగం వెంకట్రావు అధికార పార్టీ కీలక నేతలుగా ఉంటారు. ఈ క్రమంలో తుమ్మలను నమ్ముకొని ఆ ప్రాంతంలో పని చేస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారనున్నది. అదే క్రమంలో జలగంను నమ్ముకొని ఉన్న వారు ఖమ్మం జిల్లా పరిధిలో అదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇటీవల చర్ల మండలంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో జలగం వెంకట్రావు పాల్గొన్నా రు. తుమ్మల అనుచరులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయి తే వారికి అంతగా ప్రాధాన్యత లభించలేదు. భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో సుదీర్ఘకాలంగా తుమ్మల వెన్నంటి ఉన్న నాయకులు ఒక్క సారిగా అయోమయంలో పడ్డారు. కొంత(మిగతా 6లో)
మంది మాత్రం జలగం వెంకట్రావును ప్రసన్నం చేసుకునేందుకు వారి అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో ప్రస్తుతం అధికార పార్టీలో ప్రధాన పదవులను అనుభవిస్తున్న వారు కూడా ఉన్నట్లు సమాచారం. మరో వైపు ఖమ్మం జిల్లా పరిధిలో జలగం అనుచరులుగా ఉన్న వారు రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల విభజన పార్టీకి లాభిస్తుందని భావిస్తున్న నేతలకు ఈ పరిణామాలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు నెమ్మదిగా ఉన్న నేతలు తమ నేతకు ప్రాధాన్యత లభిస్తుందనే సాకుతో అధికారులపై కూడా అజమాయిషి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే నేతలు ఇరువురు మాత్రం తమ అనుచరుల్లో తామున్నామనే ధైర్యాన్ని నింపటం మినహా పెద్దగా స్పందించటం లేదని తెలుస్తోంది.