ఖమ్మం

జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, ఆగస్టు 30: ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏర్పాటు కానున్న కొత్తగూడెం నూతన జిల్లాలో జూలూరుపాడు మండలాన్ని చేర్చాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా నాయకులు మంగళవారం జూలూరుపాడులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ముందుగా పొలిటికల్ జెఎసి కన్వీనర్‌గా మాచినేనిపేటతండా సర్పంచ్ లకావతు గిరిబాబును ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్న జూలూరుపాడు మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో చేర్చటం వలన ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందన్నారు. ఇంతే కాకుండా జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న మండలం కావటంతో జూలూరుపాడు అభివృద్ది చెందటానికి కూడా మరింత అవకాశముంటుందని నాయకులు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రజల ఆశలకు అనుగుణంగా జూలూరుపాడు మండలన్ని కొత్తగూడెం జిల్లాలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈసమావేశంలో ఎంపిపి మూడు చిట్టిబాబు, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, చాపలమడుగు రాంమ్మూర్తి, టిడిపి మండల అధ్యక్షులు యల్లంకి కృష్ణయ్య, గిరిజన సంఘ నాయకులు వాంక్డోతు వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చౌడం నర్శింహారావు, సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు చీమలపాటి భిక్షం, ఎంపిటిసి బానోతు ఈశ్వర్, సిపిఐ నాయకులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు, దళిత సంఘ నాయకులు వేల్పుల నర్శింహారావు, మోదుగు ప్రభాకర్, గడిదేశి కనకరత్నం, సిపిఐ(ఎంఎల్) నాయకులు ఏదులాపురం గోపాలరావు, గిరిజన సంఘ నాయకులు భూక్యా దేవిలాల్, బాలు నాయక్, రాజేష్ నాయక్, కాన్షీరాం నాయక్, రమేష్, వెంకన్న, హతీరాం తదితరులున్నారు.