ఖమ్మం

ఇరిగేషన్ కార్యాలయం ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, ఆగస్టు 30: చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురంలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయం ఖాళీగా దర్శనమిస్తోంది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం, పై అధికారుల అలసత్వం కారణంగా కార్యాలయం ఖాళీగా దర్శనమిస్తోంది. సమయానికి కార్యాలయానికి రావాల్సిన అధికారులు రాకపోవడం, ఇంటర్నెట్ సాకు చూపుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ చేయడం సత్యనారాయణపురం ఇరిగేషన్ కార్యాలయంలో నిత్యకృత్యంగా మారాయి. కార్యాలయానికి తమ సమస్యలు చెప్పుకుందామని వస్తున్న రైతులకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండంతో అధికారులను దుమ్మెత్తి పోస్తూ నిరాశతో రైతులు వెనుదిరుగుతున్నారు. చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురంలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయం ఉంది. చర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురంలో వెంకటాపురం, వాజేడు, దుమ్ముగూడెం మండలాలకు సంబంధించి ఇరిగేషన్ కార్యాలయం ఉంది. ఇక్కడే ఆయా మండలాల్లో ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ, నీటి విడుదల, అలాగే మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షిస్తుంటారు. వీటన్నింటినీ ఇరిగేషన్ శాఖ ఈఈ దగ్గరుండి చూసుకుంటారు. ఆయా మండలాల్లోని రైతులు కూడా ఈ కార్యాలయానికే వచ్చి తమ సమస్యలు చెప్పుకొని పరిష్కరించుకునేందుకు కృషి చేస్తుంటారు. కాగా ఇంతపెద్ద కార్యాలయం ఉన్నప్పటికీ ఈ కార్యాలయానికి అధికారులు రావడానికి మాత్రం ముఖం చాటేస్తున్నారు. ఇంటర్నెట్ సాకు చూపుతూ భద్రాచలం, కొత్తగూడెంలలోనే కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే ఇరిగేషన్ కార్యాలయం సత్యనారాయణపురంలో ఉండటంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. వారు ఎప్పుడు కార్యాలయానికి వస్తున్నారో, ఎప్పుడు వెళ్లిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఏఈ, జేఈ, డీఈ, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సిబ్బంది, ఆఖరికి అటెండర్లు కూడా కార్యాలయానికి రాని పరిస్థితి. ఎప్పుడైనా కార్యాలయానికి వస్తే అటెండెన్స్ రిజిష్టర్‌ప్రైన ఒకేసారి సంతకం చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సోమవారం ఆ కార్యాలయానికి వెళ్లగా ఏ ఒక్క అధికారి కూడా కనిపించలేదు. సీనియర్ అసిస్టెంట్‌తో పాటే జూనియర్ అసిస్టెంట్, ప్రింటింగ్ ఆపరేటర్, ఆఖరికి అటెండర్లలో ఇద్దరు రాలేదు. కేవలం ఒకే ఒక్క అటెండర్, ఒకే జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తూ కనిపించారు. సబ్ డివిజన్ కార్యాలయం మొత్తం అధికారులు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు అధికారులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గతంలో ఇరిగేషన్ ఈఈ ప్రసాద్ కార్యాలయానికి సిబ్బంది రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ కిందిస్థాయి అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం రెండురోజులు మాత్రమే సమయపాలన పాటించిన అధికారులు మళ్లీ మూడో రోజు నుంచి షరా మామూలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పైస్థాయి అధికారులు విధులకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.