కర్నూల్

హంద్రీనీవా ద్వారా కెసికి నీటి విడుదల పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఆగస్టు 30:కెసి కాలువ 0-120 కి.మీ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టు వద్ద మంగళవారం పనులు ప్రారంభించింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రతి ఏటా నష్టపోతున్న రైతాంగాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల పేరుతో సర్ధిచెబుతూ వస్తున్న పాలకులు రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు హంద్రీనీవా ప్రాజెక్టుకు అమర్చిన 12 పంపుల్లో 1,12వ పంపుల ద్వారా కెసి కాలువకు నీరు విడుదల చేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 4.5కోట్లు మంజూరు చేసిందని, పనులు త్వరితగతిన పూర్తి చేసి కెసి రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈ పనులు చేపట్టారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకూ కెసి కాలువకు ఈ పంపుల ద్వారా తాత్కాలికంగా నీరు విడుదల చేయనున్నారు.