కర్నూల్

తగ్గిన ఉల్లి ధర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 30: ఉల్లిధర ఒకేసారి తగ్గిపోవడంతో పంట పండించిన రైతుకు కన్నీరు ధారగా మిగిలింది. ఉల్లి ధర తగ్గడం వల్ల నష్టాలు వచ్చాయని పలు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది రైతులకు లారీ బాడుగులు కూడా రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో కొన్ని గ్రామల్లో ఉల్లి రైతులు ఉల్లిని పొలంలో తీయకుండా అలాగే ఉంచి వేశారు. గిట్టుబాటు ధర రానప్పుడు ఎందుకు ఉల్లిని అమ్మకానికి తీసుకెళ్లాలని రైతులు పొలాల్లోకి పశువులను వదిలి పెడుతున్నారు. ఇంత భారీ స్థాయిలో ఉల్లిగడ్డ ధర తగ్గడంపై రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కోసిగి, కౌతాళం, హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, మద్దికెర, ఆస్పరి, తుగ్గలి, దేవనకొండ, నందవరం, గోనెగండ్ల, పెద్దకడబూరు మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బోరుబావుల కింద రైతులు ఉల్లి పంటను సాగు చేశారు. ఈ సంవత్సరం కూడా 25వేల ఎకరాల్లో ఉల్లి పంట రైతులు పడించారు. అయితే ఉల్లి పంట అమ్ముకోవడానికి ఆదోని డివిజన్‌లో ఎక్కడ మార్కెట్ లేదు. ఈప్రాంతంలో పండించిన ఉల్లి పంటను అమ్ముకోవడానికి రైతులు కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, తాడేపల్లె గూడెం, చెన్నై తదితర ప్రాంతాలకు లారీల్లో తీసుకొని వెళ్లే పరిస్థితి ఉంది. రెండు నెలల క్రితం ఉల్లి గడ్డ ధరలు క్వింటాలు రూ.1000 నుంచి రూ.1200 వరకు ధర పలికింది. అయితే ఆగస్టు నెల ప్రారంభం నుంచి ఉల్లిగడ్డ ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు ఉల్లిగడ్డల ధర రూ.300ల నుంచి రూ.500లకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా ధర పడిపోవడంతో ఉల్లి రైతులకు భారీ నష్టాలు వస్తున్నాయి. లారీల బాడుగులకు కూడా సరిపోవడం లేదని రైతులు రామాంజినేయులు, రాముడు తెలిపారు. దూర ప్రాంతాలైన తాడేపల్లె గూడెం, విజయవాడ, చెన్నైకు తీసుకెళ్తే లారీల బాడుగలు చేతి నుంచి కట్టే పరిస్థితి వచ్చిందని డాణాపురం రైతు ఈరన్న వాపోయాడు. మహారాష్ట్ర నుంచి అధికంగా ఉల్లి గడ్డలు రావడంతో ఈప్రాంతంలో ఉన్న ఉల్లి గడ్డలకు గిరాకి తగ్గి ధర కూడా పడిపోయిందని రైతులు వాపోయారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ధర లేకపోవడం వల్ల ఉల్లిగడ్డలను పొలాల్లోనే వదిలి వేస్తున్నట్లు రైతులు తెలిపారు. రెండు నెలల క్రితం భారీ ధరలు పలికి ఉల్లిగడ్డలు ప్రజలకు కన్నీరు పెట్టించాయి. ఇప్పుడు ఉల్లి ధరలు భారీగా తగ్గి రైతులను నష్టాల్లో ముంచెత్తడమేగాకుండా కంటనీరు తెప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగి రైతుల వద్ద సరుకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోపైపు రాయలసీమలోని అతిపెద్ద మార్కెట్ ఆదోనిలో ఉన్నప్పటికీ ఉల్లిగడ్డల కొనుగోలు కేంద్రాలు ఉన్నా ఉల్లి కొనుగోలు చేయడం లేదు. రైతులు అధిక వ్యయ ప్రయాసాలకోర్చి దూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లోకి తీసుకుని అమ్మడం కూడా రైతులకు అధిక భారంగా మారింది. దీంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దింపి ఉల్లిగడ్డలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు తప్పవని పలువురు రైతులు అంటున్నారు.