కర్నూల్

ఎకరా పంట కూడా ఎండకూడదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ : జిల్లాలో పంటలు ఎండిపోకుండా రెయిన్‌గన్ల ద్వారా నీరందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా రెయిన్‌గన్ల ద్వారా నీరందించేటప్పుడు నీరు, విద్యుత్ ససమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క ఎకరాలో కూడా పంట ఎండిపోకూడదన్న సిఎం చంద్రబాబు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి అన్ని ప్రాంతాల్లోని సమస్యలను తెలసుకుని పరిష్కరించేందుకు చర్యలు కుంటున్నామన్నారు. అలాగే నిరంతరం వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్, సూక్ష్మనీటి విభాగం, గ్రామీణ నీటి పారుదల, వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన అధికారులు కంట్రోల్ రూంలో పర్యవేక్షణ చేస్తున్నారని వెల్లడించారు. పంటలు ఎండిపోకుండా రెయిన్‌గన్ల ద్వానా నీరందించేందుకు గ్రామ పంచాయతీల్లో కూడా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే సోమవారం రాత్రి దాదాపు జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో వర్షం కురిసిందన్నారు. కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే కురవలేదన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో గ్రామీణ సరఫరా విభాగం నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి రెయిన్‌గన్ల ద్వారా పంటలను కాపాడేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక నిరంతర విద్యుత్ సరఫరా కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో జెసి హరికిరణ్, ఏ రామస్వామి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ చంద్రశేఖరరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ హరిబాబు, సిపిఓ ఆనంద్‌నాయక్, ఏపిఎంఐపి పిడి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.