హైదరాబాద్

రండి..మహిళా గర్జనను విజయవంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మైరాత్ బజార్ గ్రౌండ్స్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న మహిళా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మహిళలు ఎక్కువ సంఖ్యలో తరలి రావాలని తెరాస పార్టీ నాయకురాలు పి. అనిత పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె నియోజకవర్గంలో మహిళా నేతలతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మహానగర పాలక సంస్థలోని 150 డివిజన్లలో మొత్తం 75 డివిజన్లను మహిళలకు కేటాయించటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు తగిన విధంగా పోటీ చేసేందుక మహిళలు కూడా సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
సుమారు 10 నుంచి 12వేల మంది మహిళలు పాల్గొననున్న ఈ సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు, మహిళ నాయకురాళ్లు పాల్గొనున్నట్లు అనిత తెలిపారు.

నీటి గుంతలో పడి బాలుడి మృతి
కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 24: పాఠశాలలకు సెలవులు కావడంతో చిన్న పిల్లలతో కలిసి ఆడుకుంటుండడగా వారిలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి హౌసింగ్‌బోర్డుకు చెందిన స్థలంలో నిర్మాణం కోసం తవ్విన నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళిదాసు, విశాలాక్షి దంపతులు కొనే్నళ్ల క్రితం వలస వచ్చి కెపిహెచ్‌బికాలనీలోని 4వ ఫేజ్‌లో నివాసముంటున్నారు. వీరికి ఏడు సంవత్సరాల శాంతన్ అనే కుమారుడు ఉన్నాడు. వసంత్‌నగర్‌లోని సెయింట్ మెరీస్ హైస్కూల్ 1వ తరగతి చదువుతున్నాడు. గురువారం నుండి నాలుగురోజుల పాటు పాఠశాలకు సెలవు దినాలు కావడంతో స్థానిక చిన్నారులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లాడు. 4వ ఫేజ్‌లోని ఆర్‌టిఓ కార్యాలయం ప్రక్కన గల హౌసింగ్‌బోర్డుకు చెందిన స్థలంలో నిర్మాణం కోసం తవ్విన గోతిలో శాంతన్ కాలుజారి పడిపోయాడు. విషయం తెలుసుకొని నీటి గుంతలో పడిఉన్న బాలుడిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా హౌసింగ్‌బోర్డుకు చెందిన స్థలంలో గత మూడు సంవత్సరాలుగా నిర్మాణం కోసం గోతులు తీయగా కొన్ని కారణాలతో నిర్మాణం ఆగిపోయింది. ఆ స్థలం చుట్టూ అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే చనిపోయాడని బాలుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ /బేగంపేట, డిసెంబర్ 24: వరకట్న పిశాచికి మరో మహిళ బలైంది. కట్నకానులకలతో వివాహం జరిగినా..రెండేళ్లకే కట్నం చాలదని వేధింపులు మొదలయ్యాయి. భర్త వేధింపులు తాళలేక ఆ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళితే..బేగంపేట ప్రకాష్‌నగర్‌లో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యోగేష్ (30) రామలక్ష్మి(25) వివాహం రెండేళ్ల క్రితం జరిగింది. వివాహం సదర్భంగా ఒప్పుకున్న కట్నకానుకలు భారీగానే సమర్పించుకున్నారు. కాగా తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని తగిన కట్నం ఇవ్వలేదని, మరో 20లక్షలు కట్నం కావాలంటూ భర్త, అత్త, మామాలు తరచూ వేధిస్తూ ఉండేవారు. పోస్టల్ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న ఓ మామూలు ఉద్యోగి శ్రీలక్ష్మి తన భర్త, అత్త,మామల వేధింపులు తాళలేక ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, సరోజినిదేవి స్థానిక బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బేగంపేట ఇన్‌స్పెక్టర్ బస్వారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలావుండగా ఓల్డ్ కస్టమ్స్ కాలనీలోని పోస్టు ఆఫిసులో ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి తన స్నేహితురాలు మంజులతో కలిసి బుధవారం షాపింగ్ చేసింది. గురువారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఇంటి యజమాని అసలు విషయాన్ని గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందిన శ్రీలక్ష్మిని గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

త్రోబాల్ చాంపియన్‌షిప్‌కు తెలంగాణ జట్ల ప్రకటన
చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 24: రాజస్థాన్‌లోని కోటాలో జరుగునున్న 38వ జాతీయ సీనియర్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ పరుషులు, మహిళల జట్లను ప్రకటించారు. జట్టుకు ఎంపికైన వారి వివరాలను తెలంగాణ త్రోబాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.నవీన్‌యాదవ్, పి.జగన్‌మోహన్‌గౌడ్ వెల్లడించారు. చాంపియన్‌షిప్ ఈనెల 28వ తేదీ నుంచి 31వరకు కోటాలో జరుగుతుంది. పురుషుల జట్టుకు కెప్టెన్‌గా రంగారెడ్డి జిల్లాకు చెందిన సిద్ధేశ్వర్‌రెడ్డి, మహిళల జట్టుకు కెప్టెన్‌గా హైదరాబాద్ జిల్లాకు చెందిన గ్రీష్మారెడ్డి ఎంపికయ్యారు. పురుషుల జట్టుకు కోచ్‌గా కొమ్ము వెంకట్, మేనేజర్‌గా చక్రపాణి, మహిళల జట్టుకు మేనేజర్‌గా ఎం.వినోద్‌రెడ్డి, కోచ్‌గా చంద్రప్రకాష్ వ్యవహరిస్తారు. తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ ప్రభుత్వ హైస్కూల్ సమీపంలోని వల్లేల గ్రౌండ్‌లో గురువారం త్రోబాల్ జట్టు సభ్యులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి తెలంగాణ త్రోబాల్ సంఘం అధ్యక్షుడు వి.నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.జగన్‌మోహన్ గౌడ్, కోశాధికారి కొమ్ము వెంకట్, ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, ఎఐఎంఐఎం యువ నాయకుడు అన్వరుద్ధీన్ ఓవైసీ పాల్గొన్నారు.
* పురుషులు: సిద్ధేశ్వర్‌రెడ్డి(కెప్టెన్), డి.మున్నయ్య (రంగారెడ్డి), ఇ.జయ అమృత్‌రాజ్, ఎం.ప్రదీప్‌రెడ్డి, రాజశేఖర్, ఎం.ప్రదీప్‌రెడ్డి, రాజశేఖర్, నందన్, శ్రీనాథ్ (హైదరాబాద్), దుర్గాప్రసాద్, ప్రతాప్ (మెదక్), ఆనంద్ (కరీంనగర్), సాయిచరన్, నరేష్ (నల్గొండ), చంద్రకాంత్ (నిజామాబాద్), దృష్‌సాయి, రాకేష్ (వరంగల్), కొమ్మువెంకట్(కోచ్), చక్రపాణి (మేనేజర్).
* మహిళలు: ఎం.గ్రీష్మారెడ్డి (కెప్టెన్-హైదరాబాద్), ఎం.శ్రీలేఖ, ఇ.్ధనుశ్రీ, అమీమా (రంగారెడ్డి), వేనే్నల, దీపికా(రంగారెడ్డి), ఇందుజా, ప్రియాంక, వర్షా (హైదరాబాద్), ప్రీతి, గ్రేష్మా (మహబుబ్‌నగర్), శృతి (నల్గొండ), నిఖిత (నిజామాబాద్), శిరీష, సంయుక్త (మెదక్).

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

ఉప్పల్, డిసెంబర్ 24: గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ పీర్జాదిగూడ ఉప్పల్ క్యాంపస్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగాయి. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి చల్లా కోదండరామ్, గౌరవ అతిథిగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, గ్లోబల్ స్కూల్ చైర్మన్ మాగంటి నరసింహమూర్తి జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల సంపూర్ణ వికాసానికి కృషి చేస్తున్నామని ప్రిన్సిపాల్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. సమాజంలో విద్య ప్రాముఖ్య ఆధారంగా విద్యారంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యను అందిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు. ఈ క్రమంలో పది, పనె్నండవ తరగతి వార్షిక పరీక్షల్లో నూటికి నూరు శాతం విజయాన్ని సాధిస్తున్నారని తెలిపారు. క్రికెట్, క్విజ్, వాలీబాల్, స్పెల్ బీ వంటి కార్యక్రమాలతో విశిష్ఠమైన ప్రగతిని సాధిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనేక పురస్కారాలు, బహుమతులు తమ విద్యార్థులు అందుకుని ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారని వివరించారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన స్వాగత నృత్యం ఆకట్టుకుంది. పంచరత్న కీర్తనకు అనుగుణంగా చక్కని అభినయనంతో భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. అశోకుని జీవన విధానం అతనిలో కలిగిన మార్పులను అత్యంత మనోహరంగా అభినయించారు. పర్యావరణ పరిరక్షణపై చైతన్యవంతుల్నిచేస్తూ చిన్నారులు లయబద్ధంగా కదులుతూ నృత్యం చేసిన తీరు అందర్ని ఆకట్టుకుంది. అబ్ధుల్ కలాం దేశభక్తిని స్వార్ధరహిత జీవన విలువలను తెలుపుతూ కలాం సబ్‌కో సలాం అంటూ చేసిన నృత్యం ప్రతి ఒక్కరి హృదయాలను పులకరించాయి. రోబోటెక్స్, మైఖేల్ జాన్సన్ అభినయం లయబద్ధకమైన కదలికలతో శాంతిని ఆకాంక్షిస్తూ రోబోటెక్స్, మైఖేల్ జాన్సన్ అభినయం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు.

సాయిబాబా దేవాలయంలో అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు
నార్సింగి, డిసెంబర్ 24: నూతన శ్రీ సాయిబాబా దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలను అత్యంత వైభవంగా దేవాలయం ట్రస్టీ సభ్యులు నిర్వహించారు. లంగర్‌హౌస్ బాపూనగర్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం నూతనంగా ఏర్పాటు చేశారు. సాయిబాబా విగ్రహానికి గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతేకాకుండా మధ్యాహ్నం హారతి కార్యక్రమం కూడా నిర్వహించారు. కాగా అనంతరం ఒంటి గంటకు భక్తులకు అన్నదానం కూడా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీ సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో లంగర్‌హౌస్‌కు చెందిన శ్రీ సాయిరాం ఆసుపత్రి వారు ఉచితంగా వైద్య శిబిరం కూడా నిర్వహించారు. అయితే దేవాలయానికి వచ్చిన భక్తులు వైద్య శిబిరంలో పాల్గొని, వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించుకున్నారు. ఆ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు నాగేష్, శివకుమార్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి గురువారం నిరుపేదల కోసం ఉచితంగా వైద్య సేవలను దేవాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆలయ ట్రస్టీ ప్రధాన కార్యదర్శి సనువెళ్లి సత్యంరెడ్డి మాట్లాడుతూ లంగర్‌హౌస్ ప్రాంతంలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం లేకపోవడంతో స్థానికులు ప్రతి గురువారం వివిధ దూర ప్రాంతాలకు వెళ్లి, సాయిబాబా దేవాలయానికి వెళ్లి బాబాను దర్శించుకునే వారని పేర్కొన్నారు. అయితే లంగర్‌హౌస్ బాపూనగర్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం నూతనంగా ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతి గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
బాబాను దర్శించుకున్న ప్రతి భక్తునికి అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో సుమారు వేయిమంది భక్తులు పాల్గొన్నారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాలయం ట్రస్టీ సభ్యులు ఐ.రమేష్, కృష్ణారెడ్డి, బాలాప్రసాద్ తివారి, దూసరి శ్రీ్ధర్‌గౌడ్, కృష్ణ, రాజన్న, సపన్‌కుమార్, బిమల్ కుమార్‌తో పాటు కార్వాన్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎ బ్లాక్ అద్యక్షుడు కె.చంటిబాబు, నాగేశ్వర్ రావు, ఆకుల చంద్రశేఖర్, నాగన్న, భక్తులు భారీగా పాల్గొన్నారు. తమ ప్రాంతంలో శ్రీ షిర్డీ దేవాలయం ఏర్పాటు చేసిన ట్రస్టీ సభ్యులకు బాబా భక్తులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.