జాతీయ వార్తలు

రోమ్‌కు తరలిన సుష్మా బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: రోమ్‌లో ఏర్పాటైన నోబెల్‌శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీస్సా సెయింట్‌హుడ్(దైవత్వం) పురస్కార కార్యక్రమానికి కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హాజరవుతున్నారు.
ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి భారత్ నుంచి 12 మంది సభ్యుల బృందం హాజరవుతోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సారధ్యంలోన బృందం శుక్రవారం రోమ్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో ఇటలీ విదేశాంగ మంత్రి పాలో గింటిలోనితో సుష్మా సమావేశమవుతారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాల విదేశాంగ మంత్రులు చర్చిస్తారు. 2012లో కేరళ తీరంలో ఇటలీ మెరైన్ల కాల్పుల్లో ఇద్దరు భారతీయ జాలర్లు మృతి చెందారు.
ఇటలీ మెరైన్లు సాల్వెటోర్ గిరోనే, మస్సిమిలియనో లాటొర్రేలపై హత్యకేసు నమోదైంది. ఈకేసు సుప్రీం కోర్టు విచారణలో ఉంది. భారత న్యాయప్రక్రియపై అసంతృప్తితో ఉన్న ఇటలీ ఐరాసా ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది.
ఆరోగ్య కారణాలు చూపి బెయిల్‌పై స్వదేశం వెళ్లిన లాటొర్రే అక్కడే ఉండిపోయాడు. సుష్మా స్వరాజ్ ఇటలీ పర్యటనలో ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఇటలీ విదేశాంగ మంత్రి గింటిలోనితో భేటీ అవుతున్న విషయాన్ని సుష్మా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా కేంద్ర బృందంతోపాటు, రెండు రాష్ట్రాల ప్రతినిధి బృందం థెరీస్సా సెయింట్‌హుడ్ కార్యక్రమంలో పాల్గొంటోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రోమ్ పయనమయ్యారు.