సాహితి

ఏనుకున్న మొక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మబ్బులు ముసురు సితారా
సంగీతం వెదజల్లుతున్నప్పుడు
నాలో ఒక ఊహ ఏమనుకుంటున్నది

కాలు భూమిమీద మోపకముందే
తడితడయిన చెల్కమించి
పిట్టపాట
మనసును పదును చేసి పోయింది

రోజుల తరబడి ముడుచుకున్న ఆశ
మూటలోనుంచి విప్పుకుంటున్నది

తుంపర తుంపర నడుమ గొర్రుగొడుతున్న
దాపటి ఎద్దు కండ్లల్లనుంచి
కరువు జారిపోతున్నది

ఊరు వానముసురు కప్పుకొని
పచ్చదనం కలగంటున్నట్టున్నది

కాల్వలు గట్టిన సంతోషం
చింత చెట్టుకు కట్టిన ఉయ్యాలై ఊగుతున్నది

చెరువు మించి చిలుకల గుంపు ఎగురుతూ
కాలానికి సలాం చెపుతున్నయ్

వడికిన దూదిలాంటి మనిషి
వానల తడిసిముద్దై ఇంట్ల కొత్తవెట్టుకుంటున్నడు

- వేముగంటి మురళీకృష్ణ 9676598465