హైదరాబాద్

నిర్మాత కెఎస్ రామారావు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: నగరంలోని జూబ్లీహిల్స్ ఫిల్మ్ కల్చరల్ సెంటర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిన సంఘటనలో ఎఫ్‌సిసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత స్టేషన్ బెయిల్‌పై వారిని విడుదల చేశారు. గత నెలలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ప్రమాదంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిర్మాణ కెఎస్ రామారావుతోపాటు రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేశారు. కాగా వీరికి రూ. 5వేలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ మంజూరైంది. ఫిల్మ్‌నగర్‌లో భవనం కూలిపోయిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, నలుగురు గాయపడిన విషయం విధితమే. ఈ కేసులో మృతుల కుటుంబాలకు జిహెచ్‌ఎంసి, ఫిల్మ్ కల్చరల్ సెంటర్ కౌన్సిల్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తులో ఉన్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.