జాతీయ వార్తలు

షిరిడీ- హైదరాబాద్ బస్సు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్/తణుకు, సెప్టెంబర్ 16: షిరిడినుంచి హైదరాబాద్ వస్తున్న ఏసీ స్లీపర్ క్లాస్ ప్రైవేట్ బస్సు మార్గమధ్యంలో అగ్నికీలలకు ఆహుతైంది. ఇంజన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన నాలుగేళ్ల బాలుడు విహాంత్ మంటలకు ఆహుతైపోయాడు. బస్సులో ఉన్న 31మంది కొద్దిపాటి గాయాలతో ప్రమాదంనుంచి బయటపడ్డారు. వీరిలో నాగలక్ష్మి అనే యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. షిరిడీనుంచి హైదరాబాద్‌కు వస్తున్న కావేరీ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నారు. తణుకు పట్టణానికి చెందిన అచ్యుతరామప్రసాద్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు కుమారులతో షిరిడీకి వెళ్లిన ప్రసాద్ తిరుగు ప్రయాణంలో ఇదే బస్సు ఎక్కారు. బస్సు హుమ్నాబాద్ సమీపంలోని రాజా దాబా సమీపానికి వచ్చేసరికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతోందో అర్థమయ్యే సరికే మంటలు బస్సును నాలుగువైపులనుంచీ చుట్టుముట్టాయి. హడావిడిలో ప్రసాద్ భార్య వెంకటేశ్వరి, పెద్దకొడుకుతో బస్సు దిగేశారు. చిన్న కొడుకు విహాంత్ బస్సులోనే ఉండిపోవడంతో మంటలకు ఆహుతైపోయాడు. ప్రమాదాన్ని గమనించిన దాబాలో ఉన్న జనం కూడా బస్సు వద్దకు పరుగెత్తుకు వచ్చి, అద్దాలు పగులగొట్టి, ప్రయాణికులను రక్షించారు. గాయపడిన వారికి హుమ్నాబాద్ ఆసుపత్రిలోప్రథమ చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ లేదని రోడ్డు రవాణాసంస్థ అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌నుంచి ముంబాయి వరకు అనేక చెక్‌పోస్టులున్నా ఎక్కడా ఈ అంశాన్ని అధికారులు గుర్తించక పోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. కాగా బస్సు దగ్ధమైన ఘటనకు, కావేరీ జల వివాదం నేపథ్యంలో జరుగుతున్న ఆందోళనలకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.

చిత్రం... అగ్నికి ఆహుతైన బస్సు