క్రీడాభూమి

ఇంకెంత కాలం? రోహిత్, ధావన్‌లకు సహకారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 17: ఆశించిన స్థాయిలో రాణించలేక విఫలమవుతున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు భారత సెలక్టర్లు ఇంతకెంత కాలం సహాయసహకారాలను అందిస్తారన్న విమర్శలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో, న్యూజిలాండ్‌తో ఆరంభం కానున్న మొదటి టెస్టు మ్యాచ్ వీరికి పరీక్ష పెట్టనుంది. దేశవాళీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచిన ఎంతో మంది యువ ఆటగాళ్లు జాతీయ జట్టులో స్థానం కోసం వేచి చూస్తుంటే, పదేపదే నిరాశ పరుస్తున్న రోహిత్ ధావన్‌లనే సెలక్టర్లు ఎందుకు నమ్ముతున్నారో అర్థం కావడం లేదన్న విమర్శలకు భారత క్రికెట్ పెద్దల నుంచి సరైన సమాధానం లేదు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు సంపూర్ణంగా ఉంది కాబట్టే వీరిపై వేటు పడడం లేదన్న వాదన లేకపోలేదు. పలు సందర్భాల్లో కోహ్లీ వీరిద్దరినీ ఆకాశానికి ఎత్తేశాడు. ఐదో స్థానంలో రోహిత్‌ను మించిన బ్యాట్స్‌మన్ లేడని, మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి అతనికి మాత్రమే ఉందని కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. రోహిత్‌కు జాతీయ సెలక్టర్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకొంటున్న సందీప్ పాటిల్ ఆశీస్సులు కూడా పుష్కలంగానే ఉన్నాయి. ధావన్‌ను కూడా కోహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, పరుగుల వరద సృష్టించే బ్యాట్స్‌మన్‌గా ధావన్‌ను అభివర్ణించాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన అతని శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అన్నాడు. కెరీర్‌లో ఎవరికైనా ఒడిదుడుకులు సహజమని, ఫామ్‌లో లేనప్పుడే తగినన్ని అవకాశాలిచ్చి నిలబెట్టాలని పేర్కొన్నాడు. రోహిత్, ధావన్‌లను కోహ్లీ ఏ విధంగా సమర్థిస్తున్నాడనేది అతని మాటల్లో స్పష్టమవుతున్నది.
రోహిత్ కంటే ధావన్ బెటర్!
సుమారు ఏడాదిన్నరగా రోహిత్, ధావన్ నిలకడలేని ఆట కొనసాగుతున్నది. అయితే, ఒకరితో మరొకరిని పోలిస్తే, రోహిత్ కంటే ధావన్ కొంచం మెరుగ్గా ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్ టూర్‌కు వెళ్లినప్పుడు రోహిత్ అత్యధిక స్కోరు 41 పరుగులుకాగా, అంటీగువా టెస్టులో ధావన్ 84 పరుగులు చేశాడు. ఏడాదిన్నర రికార్డులను పరిశీలిస్తే, రోహిత్ మొత్తం ఏడు టెస్టులు ఆడాడు. కేవలం మూడు అర్ధ శతకాలను నమోదు చేయగలిగారు. శ్రీలంకపై కొలంబోలో చేసిన 79 పరుగులు అతని అత్యధిక స్కోరు. అతను చివరిసారి టెస్టు శతకాన్ని 2013లో వెస్టిండీస్‌పై చేశాడు. ముంబయిలో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను అజేయంగా 111 పరుగులు సాధించాడు. సుమారు ఏడాదిన్నరగా రోహిత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. అతనితో పోలిస్తే ధావన్ పరిస్థితి మెరుగ్గా ఉంది. నిరుడు జూన్ మాసంలో బంగ్లాదేశ్‌పై అతను 173 పరుగులు చేశాడు. ఆ ఏడాది అతనికి అదే తొలి టెస్టు. ఆగస్టులో శ్రీలంకపై 134 పరుగులు సాధించాడు. ఆతర్వాత అతని వైఫల్యాలు మొదలయ్యాయి. ఇటీవల టూర్‌లో వెస్టిండీస్‌పై సాధించిన 84 పరుగులను మినహాయిస్తే, అతను శ్రీలంకపై శతకం తర్వాత ఏ మ్యాచ్‌లోనూ ముప్పయి కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు.
రాహుల్ నుంచి ప్రమాదం
రోహిత్, ధావన్‌లకు సత్వర ప్రమాదం లోకేష్ రాహుల్ నుంచి పొంచి ఉంది. ఇప్పటికే సమర్థుడిగా పేరు సంపాదించిన రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు. మరోవైపు ఓపెనర్ మురళీ విజయ్ కూడా బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. రాహుల్, విజయ్ కాంబినేషన్ భారత్‌కు దీర్ఘకాలం ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాహుల్ ఇదే స్థాయిలో ఆడితే, రోహిత్, ధావన్‌లకు జట్టులో స్థానం నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వీరు అటోఇటో తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రాబోయే సిరీస్‌లోనూ విఫలమైతే, కెప్టెన్‌గానీ, సెలక్టర్లుగానీ వీరికి అండగా నిలుస్తారన్న గ్యారంటీ లేదు.