అనంతపురం

గుత్తి శివార్లలో ‘రియల్ ’ వ్యాపారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, సెప్టెంబర్ 22 : గుత్తి పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుండడంతో కొంతమంది వ్యాపారులు అక్రమంగా లేఅవుట్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా అధిక లాభాలు గడించడానికి అలవాటు పడ్డ వ్యాపారులు ఎలాంటి అనుమతులు పొందకుండా లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణం మున్సిపాలిటీగా మారడంతో ఈప్రాంతంలో భూములకు మరింత విలువ పెరిగింది. అంతేగాకుండా పట్టణానికి అనుకుని 44వ నెంబర్ జాతీయ రహదారి వెళ్తుండడంతో ఒక్కసారిగా భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో కర్నూలు, కడప, అనంతపురం, ఆదోని తదితర ప్రాంతాలకు చెందిన పెద్దపెద్ద వ్యాపారులు వచ్చి తక్కువ ధరకు భూములు కొని తమ ఏజెంట్ల ద్వారా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో ఐదు కిలోమీటర్ల వరకూ ఎవరూ మున్సిపాలిటీ అప్రూవల్ లేకుండా ప్లాట్ల వ్యాపారం చేయరాదు. ఎవరైనా ప్లాట్లు వేయాలనుకుంటే ముందుగా జిల్లా అధికారుల నుంచి ల్యాండ్ కన్వర్షన్‌కు సంబంధించిన అనుమతులు పొందాలి. అంతేగాకుండా లేఅవుట్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా తప్పనిసరిగా చిల్ట్రన్స్ పార్కు, పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని వదలాలి. ఇలాంటివి ఏవీ లేకుండా కొంతమంది రియల్‌ఎస్టేట్ వ్యాపారులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని అటు మున్సిపల్, రెవెన్యూ శాఖల నింబంధనలు అతిక్రమించి ప్లాట్లు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారులకు ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లు వేసి ప్రజలకు అంటగడుతున్నారు. అయితే కొన్న తర్వాత ప్లాట్ యజమానులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఇలా కొనుగోలు చేసిన ప్లాట్ల ఆధారంగా బ్యాంకు రుణాలు పొంది గృహాలు నిర్మించుకోవడానికి సైతం సాధ్యపడదు. ఇప్పటికైనా సంబంధింత అధికారులు చర్యలు తీసుకుని అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తహశీల్దార్ వివరణ: ఈ విషయంపై తహశీల్దార్ సరస్వతిని వివరణ కోరగా అక్రమ లేఅవుట్లపై తమ దృష్టికి రాలేదన్నారు. అయితే త్వరలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి అనుమతి లేకుండా లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాకుండా నోటీసులు జారీ చేయడంతోపాటు ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు తప్పక వసూలు చేస్తామన్నారు.