కర్నూల్

గోరుకల్లు రిజర్వాయర్‌ను సందర్శించిన అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం, సెప్టెంబర్ 23: మండల పరిధిలోని కొండజూటూరు గ్రామంలో గోరుకల్లు రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసుకున్నందున గోరుకల్లు గ్రామంలో నీటి బుగ్గ లు ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. వాటి ఉద్ధృతిని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లోగడ రాజకీయ నాయకులు, అధికారు లు, ఈ గ్రా మాన్ని సందర్శించారు. శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి గోరుకల్లు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఒక ప్రాంతంలో నాలుగు అడుగుల గుంత తవ్వగా అక్కడ నీటి బుగ్గలు ఉబకడం పరిశీలించారు. గ్రామంలోని రైతు శివశంకర్‌రెడ్డి ఇంట్లో చేదుడు బావిలో కూడా నీరు ఉబుకుతున్న విషయాన్ని ఇంటి యజమాని ఆర్డీఓకు తెలియపరచారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ నీటి బుగ్గల ఉద్ధృతిని నియంత్రించడానికి చర్యలు తీసుకొని నివేదికలు సిద్ధం చేయాలని తన వెంట వచ్చిన ఇరిగేషన్ అధికారులు సంజీవ్ చౌదరి, అసన్ అహ్మద్, వెంకటరెడ్డి, నరేష్‌లను ఆదేశించారు. కాగా ఈ ఏడాది 5 టిఎంసిల నీటిని రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం సంకల్పించగా ఇప్పటికి 2.7 టిఎంసిల నీళ్లు ఉన్నాయి. అయితే ఇటీవల గ్రామంలో నీటి బుగ్గలు పుడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గ్రామంలోని కోనేరులో నీరు ఉబుకుతుండగా వాటి నుంచి పశువులు, పిల్లలకు అపాయం కలుగ కుండ దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆర్డీఓ స్థానిక ప్రెసిడెంట్‌ను, సెక్రటరీని ఆదేశించారు. గ్రామంలో నీటి బుగ్గల ఉదృతి పెరుగుతున్నందున తమకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్డీఓ స్పందిస్తూ అధికారులు నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించిన తరువాత వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయన వెంట డిఎల్‌పిఆర్‌ఓ శివకుమార్, సర్పంచ్ ఉషారాణి, రైతులు ఉన్నారు.