కర్నూల్

చెరువుల్లో పూడికతీతకు సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 23:జిల్లాలోని నీటిపారుదల చెరువులో ముళ్లకంపలను తొలగించి పూడికతీత పనులు చేపట్టేందుకు సర్వే ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 23మండలాల తహశీల్దార్లు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 23 మండలాల పరిధిలో ఉన్న చెరువుల్లో ముళ్లపొదలు తొలగించేందుకు ఇరిగేషన్, సర్వే, రెవెన్యూ, ఎస్‌ఆర్‌ఇజిఎస్ అధికారులు సమన్వయంతో సర్వే పనులు ప్రారంభించాలన్నారు. ముళ్ల కంపలను తొలగించిన అనంతరం ఏ చెరవులో ఎంత లోతు పూడిక తీయాలో ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పూడికతీత మట్టిని బయటకి తరలించకుండా చెరువుగట్లకు పెగ్‌మార్క్ వేసి పటిష్టం చేయాలని సూచించారు. చెరువు గట్లపై వేప, తుమ్మ, టేకు మొక్కలను పెద్దఎత్తున నాటి పరిరక్షించాలన్నారు. అన్ని వాగులో 5 కి.మీలకు 10 చెక్‌డ్యాంలు చొప్పున ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం కింద నిర్మించేందుకు ప్రతిపాదనలు సమర్పిస్తే మంజూరు అనుమతులు జారీ చేస్తానన్నారు. జిల్లాలో దాదాపు 1500 వాగులు ఉన్నాయని వాగులు లీకేజీ కాకుండా పటిష్టపరిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. రాయలసీమలోని 4 జిల్లాల్లోకి కర్నూలు జిల్లాలో 8.5మీటర్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ సమోదైనట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఇరిగేషన్ ఎస్‌ఇ చంద్రశేఖర్‌రావు, డ్వామా పిడి పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.