అనంతపురం

బాలయ్య.. రావాయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, సెప్టెంబర్ 23 : నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాలయ్య స్థానికంగా ఉండకపోవడం.. ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారం పట్ల దృష్టి కేంద్రీకరించకపోవడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. తన వందో సినిమా బిజీలో ఉన్న బాలకృష్ణ వీలైనప్పుడు మాత్రం ఇక్కడికి విచ్చేస్తూ సందడి చేసి వెళ్లిపోతున్నారన్న ఆందోళన నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జిల్లాస్థాయి ఆసుపత్రిగా గుర్తింపు కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కీలకమైన డాక్టర్ పోస్టులు, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వయంగా జిల్లా ఇన్‌చార్జి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా బాలకృష్ణ సమక్షంలో ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, కీలకమైన పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని ఏడాది క్రితమే హామీ ఇచ్చారు. హామీ కేవలం మాటలకే పరిమితమైంది. దీనికి తోడు ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం ఆసుపత్రిని పలు దఫాలు సందర్శించిన సందర్భంగా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఆయన హామీలూ నీటిమూటలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులతోపాటు డెంగ్యూ వ్యాధి ప్రబలగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో రోగులు కిక్కిరిసిపోతున్నారు. దీనికి తోడు గురువారం ముగ్గురు డెంగ్యూ వ్యాధితో ఇక్కడ చేరగా తాజాగా శుక్రవారం అమరాపురం మండలం నుంచి ఓ ఆరేళ్ల చిన్నారి ఇదేవ్యాధితో ఇక్కడ ఆసుపత్రిలో చేరింది. సీజనల్ వ్యాధులతోపాటు విష జ్వరాలు, డెంగ్యూ తదితర వ్యాధులతో హిందూపురం ప్రభుత్వాసుపత్రి కిక్కిరిస్తోంది. అయితే అవసరమైన మేరకు వైద్యులు, నర్సులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న నర్సులు ఏకంగా 24 గంటల పాటు పనిచేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఎంతో కీలకమైన సర్జన్ పోస్టు ఇప్పటికీ భర్తీ కాకపోవడం ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వచ్చినప్పుడు మాత్రం సందడి చేసి అసలైన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లకుండా ఇటు రాజకీయ నాయకులు అటు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ ఇమేజ్‌తో జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి వహించడం లేదన్న అభిప్రాయాలు వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా రూ.100 కోట్లతో హిందూపురం కూరగాయల మార్కెట్ నిర్మాణం చేస్తామని ఆర్భాటంగా హామీ ఇచ్చినా ఇప్పటికీ కనీసం భూమిపూజకు కూడా నోచుకోకపోగా షెడ్ల ఏర్పాటుకు దృష్టి సారిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఈదిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం పట్ల విమర్శలకు దారి తీస్తోంది. అదేవిధంగా ఆటోనగర్‌లో సమస్యలు ఏకరవు పెడుతుండగా ఆయా వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తాగునీటి సమస్యపై కూడా మాటలకు బాలయ్య హామీలు పరిమితమవుతున్నాయన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. వారం రోజుల క్రితం హిందూపురంలో ఇరువర్గాల నడుమ చోటు చేసుకున్న ఘర్షణ విషయంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనబడినట్లు ఏకంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తం చేస్తుండటం విశేషం. రాష్ట్రంలో సున్నిత ప్రాంతంగా పోలీసు రికార్డుల్లో ఉన్న హిందూపురంలో చాకచక్యంగా, నిక్కచ్చిగా వ్యవహరించే పోలీసు అధికారులను నియమింపచడంలో బాలయ్య దృష్టి వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా నియోజకవర్గ పరిస్థితులపై అవగాహన చేసుకుని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కార దిశగా వ్యవహరించే విధంగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.