హైదరాబాద్

వ్యాధులు ప్రబలకుండా సంచార వైద్య వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తరుచూ కురుస్తోన్న వర్షాల కారణంగా వీధుల్లో, రోడ్లపై రోజుల తరబడి వరద నీరు నిల్చి ఉండటంతో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా మరిన్ని భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో ప్రజలకు అవసరమైనపుడు వైద్యం అందుబాటులో ఉండేందుకు వైద్యారోగ్యశాఖకు సెలవులను రద్ద చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని వానల కంట్రోర్ రూంను ఆయన శుక్రవారం సందర్శించారు. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున, క్షేత్ర స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అంతేగాక, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా, భద్రాచలం, ఏటూరు నాగారం, అచ్చంపేట, అదిలాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో అంటువ్యాధులతో సంభవించే మరణాలను తగ్గించామని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి నీరు నిల్చి ఉండటంతో అక్కడ దోమలు వంటివి విజృంభించకుండా ముందుజాగ్రత్తగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేయాలని ఆదేశించామన్నారు. మున్సిపల్ శాఖను సమన్వయం చేసుకుని నగరంలో ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలకు వైద్యం పరంగా తగిన సేవలందించేందుకు 15 మొబైల్ హెల్త్ వాహనాలు(104)ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఒక్కోక్క వాహనంలో డిప్యూటీ మెడికల్, హెల్త్ ఆఫీసర్, ఓ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌తో పాటు కింది స్థాయి సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ రకంగా వర్షాలు కురుస్తున్నపుడు ప్రజలు సురక్షిత మంచినీటినే సేవించాల్సి ఉంటుందని, ఒక వేళ అది అందుబాటులో లేని పక్షంలో, ఏదైనా అనుమానం వచ్చినా ఇంట్లో ఉన్న నీటినే కాచి వడబోసుకున్న తర్వాతే సేవించాలని సూచించారు. వానాలతో ప్రజలకు ఆరోగ్యపరంగా తలెత్తే అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా వ్యాధులు, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకుని వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో కూడా వానా కాలం ప్రబలే వ్యాధుల పట్ల అవగాహన పెరిగిందని, అందుకే సర్కారు ఆసుపత్రులకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని మంత్రి వివరించారు.