హైదరాబాద్

వీడని వాన..నగర ప్రజల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెప్టెంబర్ 23: గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరాన్ని వీడటం లేదు. భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి. దీంతో నగరవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు క్షణ క్షణం భయంతో జీవిస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని మారుతీనగర్, ఇంద్రానగర్, ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్, టెస్ట్‌బుక్ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయం వద్ద మోకాలి లోతు నీరు ప్రవహించింది. ఉదయం నుంచి వర్షం లేకపోయినా శుక్రవారం సాయంత్రం వరకు ఈ నీరు అలానే ఉండటంతో ఆయా ప్రాంతాల్లో నివసించే వారు, ఆ రోడ్ల గుండా ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఖైరతాబాద్‌లో కూలిన గోడ
భారీ వర్షాలతో ఐ మ్యాక్స్ ఎదురుగా ఉన్న బస్తీలోని ఓ ఇంటి గోడ కుప్పకూలింది. పెయింటింగ్ పనిచేసుకున్న వెంకటయ్య తన కుటుంబంతో కలిసి ఓ పాత ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షంతో మట్టిగోడ పూర్తిగా నాని శుక్రవారం ఉదయం కూలిపోయింది. కాగా ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఖైరతాబాద్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి
భారీవర్షాల కారణంగాజలమయం అయిన ఖైరతాబాద్‌లోని పలు ప్రాం తాల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం పర్యటించారు. ఇంద్రానగర్, ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేతో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోడ కూలిన వెంకటయ్య ఇంటిని పరిశీలించిన ఆయన ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిహెచ్‌ఎంసి అధికారులు, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి సైతం ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. మరో మూడురోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపధ్యంలో పురాతన ఇళ్లలో నివసించే వారు ఖాళీ చేయాలని జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కోరారు. వర్షాలతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న ప్రాంతాలను డిప్యుటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పరిశీలించారు. శుక్రవారం ఉదయం డిఎంసి అశోక్ సామ్రాట్, ట్రాఫిక్ ఏసిపి మాసూమ్ బాషాలతో కలిసి ఆయన పర్యటించారు. నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా జిహెచ్‌ఎంసి, వాటర్ వర్క్స్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు జరిపించాలని ఆదేశించారు.