మెదక్

కొడుకును రక్షించబోయి దుర్మరణం తండ్రి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, సెప్టెంబర్ 23: కన్న కొడుకును రక్షించబోయి తండ్రి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం కొల్చారం మండలం కొంగోడ్ గ్రామ శివారులోని అల్లువాని బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన నాయిని శ్రీనివాస్ వెల్దుర్తి మండలం దామరంచ గ్రామానికి కారును కిరాయికి తీసుకొని వచ్చారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లువాని బ్రిడ్జి నిండుగా పారుతున్న నేపథ్యంలో కారు బ్రిడ్జి మధ్యలోకి రాగానే నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. వెంటనే శ్రీనివాస్ డోర్ తీసుకొని కారుపైకి ఎక్కి తన తండ్రి స్వామికి ఫోన్‌లో సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడకు వచ్చన నాయని స్వామి (50)ఒక తాడు తీసుకొని అక్కడికి వచ్చి తాడు సహాయంతో కొడుకును కాపాడుదామని ఒక చెట్టుకు, తన నడుముకు తాడు కట్టుకొని ఉద్ధృతంగా పారుతున్న నీటిలో దిగాడు. ఐతే ప్రవాహం ఎక్కువ కావడంతో నాయిని స్వామి (50) నీటిలో కొట్టుకుపోయ మృతిచెందాడు. కొంగోడ్, చిట్యాల గ్రామస్థులు, ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మెదక్ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో శ్రీనివాస్‌ను రక్షించారు. అలాగే స్వామి మృతదేహాన్నీ బయటకు తీశారు. కొల్చారం ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి స్వామి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.