మెదక్

మూడేళ్ల తర్వాత తెరుచుకున్న సింగూర్ గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 23: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంజీర నది పరివాహక ప్రాంతంలో పుష్కళంగా వర్షాలు కురియడంతో సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోకముందే ఎగువ నుంచి వస్తున్న నీటిని బేరీజు వేసుకున్న నీటి పారుదల శాఖ అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడానికి సిద్దమయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు 32 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. మంజీర నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తం చేయాలని అధికార యంత్రాంగానికి మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేసారు. రాత్రి 8 గంటలకు ప్రాజెక్టులో 24 టిఎంసిల నీటి నిల్వకు చేరుకోగా ఎగువ నుంచి 90 వేల నుంచి ఒక లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సింగూర్ నుంచి వస్తున్న వరద నీటితో పాటుగా మంజీర బ్యారేజ్‌లోకి వస్తున్న వరదను మొత్తంగా దిగువన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేయనున్నారు. మంజీర నదికి పెద్ద ఎత్తున వరద తాకిడి పెరగనుండటంతో పరివాహక ప్రాంతాలకు చెందిన రెవెన్యూ, వ్యవసాయం, పోలీసు యంత్రాంగానికి ఖచ్చితమైన ఆదేశాలు జారీ అయ్యాయి. పరివాహక గ్రామాల్లో దండారాలతో టాంటాం చేయించారు. మరోవైపు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ మొత్తంలో వరద నీరు వెళ్లిపోతుంది. ఏడుపాయల దుర్గా భవాని మందిరానికి భక్తులు వెళ్లకుండా మంజీర పరవళ్లు తొక్కుతోంది. దీంతో అమ్మవారి ఆలయంలో నిత్యపూజలు నిలిచిపోయాయి.